పాక్ క్షిపణి పై వెల్లువెత్తుతున్న అనుమానాలు

పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు భారత్ ఏది చేసినా అదే చేయాలని, ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ తెగ ఆరాటపడుతోంది.

ఇటీవల భారత్ లో పెద్ద నోట్లను రద్దు చేస్తే పాక్ కూడా అదే దారిలో వెళ్లాలనుకుంది. అయితే ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి కనిపించడంతో వెంటనే వెనక్కు తగ్గింది.

ఇటీవల క్షిపణుల ప్రయోగంలో భారత్ అగ్రదేశాలకు సవాలు విసురుతుండటంతో తానేమీ తక్కువ తినలేదని పాక్ కూడా మిస్సైల్స్ విసరడానికి రెడీ అయిపోయింది.

ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి నుంచి ప్రయోగించగల అణ్వస్త్రాలు మోసుకెళ్లగలిగే బాబర్-3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు సోమవారం దాయాది దేశం ప్రకటించింది.

450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదిస్తుందని పేర్కొంది. మన దేశంలోని కీలకమైన ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.

ఇక పాక్ మీడియా దీన్ని దేశ చరిత్రలోనే ఓ అమోఘ ఘటనగా అభివర్ణించింది.

అయితే పాక్ ప్రయోగించిన ఆ క్షిపణికి అంత సీన్ లేదని భారత వర్గాలు పేర్కొంటున్నాయి.

పాక్ విడుదల చేసిన వీడియో కల్పితమని, గ్రాఫిక్స్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలో చాలా లోపాలు ఉన్నాయన్నారు.

అయితే, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాక్ గ్రాఫిక్స్ మిస్సైల్ ప్రయోగించిందని అది చాలా అద్భుతంగా ఉందని భారత నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ మిస్సైల్ అంత వేగంగా పాక్ పరువు పోయిందని నవ్వుకుంటున్నారు.

మరో వైపు పాక్ నెటిజన్లు దీన్ని తమ దేశ చరిత్రలోనే ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.