Asianet News TeluguAsianet News Telugu

దీపక్ రెడ్డి అరెస్టు గురించి చంద్రబాబుకు తెలుసా?

దీపక్ రెడ్డి ఆస్తిపాస్తుల వివరాలను తెలంగాణా పోలీసులు ఆంధ్ర అధికారులనుంచి సేకరించారు. ఒక వారం కిందట హైదరాబాద్ సెంట్రల్ క్రెం స్టేషన్ అభ్యర్థన మేరకు దీపక్ రెడ్డి గురించిన సమగ్రసమాచారాన్ని ఆంధ్రఅధికారులు అందించారు. అధికారపార్టీ ఎమ్మెల్సీ గురించి తెలంగాణాప్రభుత్వం ఆంధ్ర అధికారుల సహాయంతో కూపీలాగుతున్నపుడు అది తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఉంటుందా?  అయితే, నాయుడు ఎందుకు  పార్టీ ఎమ్మెల్సీని  కాపాడలేదు? 

is naidu aware of TDP MLC Deepak Reddys impending arrest by Telangana police

హైదరాబాద్ లో భూకబ్జాకేసులలో తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని అరెస్టు చేస్తున్న విషయం ఆంధ్ర ప్రభుత్వానికి తెలుసా?

ఏషియానెట్  సేకరించిన సమాచారం ప్రకారం దీపక్ రెడ్డి ఆస్తిపాస్తుల వివరాలను తెలంగాణా పోలీసులు ఆంధ్రప్రదేశ్ అధికారులనుంచి సేకరించారు. ఒక వారం కిందట ఆంధ్రప్రదేశ్ అధికారులు ఈ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందించారు. హైదరాబాద్ సెంట్రల్ క్రెం స్టేషన్ అభ్యర్థన మేరకు దీపక్ రెడ్డి గురించి సమగ్రసమాచారాన్ని ఆంధ్ర అధికారులు అందించారని పోలీసు వర్గాలు తెలిపాయి. అధికారపార్టీ ఎమ్మెల్సీ గురించి తెలంగాణాప్రభుత్వం ఆంధ్ర అధికారుల సహాయంతో కూపీలాగుతున్నపుడు అది తెలుగుదేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఉంటుందా అనేది ప్రశ్న.

తాము తెలంగాణా సెంట్రల్ క్రెం స్టేషన్ కోరిన సమాచారాన్నంతా అందించామని ఆంధ్రా అధికారి ఒకరు ధృవీకరించారు.


దీపక్ రెడ్డి అసాధ్యుడే. ఇండియాలో బహుశా ఎవరూ పేర్కొననంతా అస్తుల విలువ ఎన్నికల అఫిడవిట్ లో  ఆయన పేర్కొన్నారు. ఒక ఎన్నికల పిటిషన్ లో ఆయన పేర్కొన్న ఆస్తుల విలువ రు. 6000 కోట్లు.2009-10 అసెస్మెంట్ ఇయర్ లో ఆయన ఆదాయం కేవలం రు. 3.27 లక్షలే. ఆయన భార్య ఆదాయం రు. 1.98 లక్షలే. 2012 నాటికే ఆయన మీద చాలా ఫిర్యాదులందాయి.బెదిరింపులు, ఆస్తుల ధ్వంసం, భూకబ్జాలకు సంబంధించి నవి  ఈ కేసులు.ఈ ఏడాది మార్చిలో ఒక ఫోర్జరీ కేసుకూడా ఆయన మీద నమోదయింది. అనంతపురం తెలుగుదేశం ఎమ్మెల్యే జెపి దివాకర్ రెడ్డి అల్లుడి వరస అవుతాడు.

 

గుజ్రాల్ హైదరాబాద్ కలెక్టర్ గా, శేషాద్రి రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్నపుడు  దీపక్ రెడ్డి భూకబ్జా కార్యకలాపాలకు చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది. ఇక ఆయనను అరెస్టు చేస్తారని, ఆయన చెరలో ఉన్న భూములను వెనక్కితీసుకుంటారని అంతా అనుకున్నారు. అయితే, రాజకీయ వత్తిడులు పనిచేశాయి. అనుకున్నది జరగలేదు. ఇద్దరు అధికారులు బదిలీ మీద వెళ్లిపోయారు.

 

అయితే, ఇపుడు దీపక్ రెడ్డి అరెస్టుకు అంధ్రా అధికారులు సహకరించడం, ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా దాచడం వెనక  బలమయిన రాజకీయ కారణాలున్నాయంటున్నారు. దీపక్ రెడ్డి బాగా రాజకీయ, డబ్బు ప్రాబల్యం ఉన్నవాడు. రాయదుర్గం నేమకల్ దగ్గిర మైనింగ్, క్రిషింగ్ వ్యాపారాలుకూడా ఉన్నవాడు. జెసి దివాకర్ రెడ్డికి వేలువిడిచిన మేనల్లుడు .కాబట్టి ఈ విషయం పొక్కితే, దీపక్ రెడ్డి మాయమై పోవచ్చు. అందువల్ల ఆంధ్రా అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు.చడీ చప్పుడు లేకుండా తెలంగాణా పోలీసులడిగిన సమాచారమంతా ఇచ్చారు.

 

పార్టీ ఎమ్మెల్సీ వ్యవహారమయినా  తెలుగుదేశం ప్రభుత్వం కూడా మౌనంగా ఎందుకుంది?. దీనికి రెండు కారణాలు చెబుతున్నారు. దీపక్ రెడ్డి భూ వ్యాపారాల మీద తెలంగాణా ప్రభుత్వం చర్య తీసుకోవాలనుకున్నపుడు, అడ్డుపుల్ల వేసేధైర్యం ముఖ్యమంత్రి కి లేకుండా పోయింది. వోటుకు నోటు తర్వాత ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలలో తలదూర్చడం మంచిదికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించి ఉండవచ్చని ఒక వర్గం చెబుతూ ఉంది.

 

రెండో కారణం, దీపక్ రెడ్డి రాయదుర్గం రాజకీయాలు. దీపక్ రెడ్డి అంతటి ఘరానా రాయదుర్గం రాజకీయాలను బోయ కులానికి చెందిన కాలవ శ్రీనివాస్ కు వదిలేస్తాడంటే ఎవరూ నమ్మరు.  కాలవ శ్రీనివాసులు ముఖ్యమంత్రికి చాలా ఇష్టుడయిన నాయకుడు.  కాలవ శ్రీనివాసులు స్థానాన్ని డబ్బుతో అస్థిరపరిచేందుకు దీపక్ రెడ్డి ప్రయత్నం చేయవచ్చనే అనుమానాలు టిడిపి వర్గాల్లో ఉన్నాయి. అందువల్ల  కాలువ శ్రీనివాస్ స్థానాన్ని పదిలపర్చేందుకు దీపక్ రెడ్డి మీద కొంత చెక్ అవసరమని ముఖ్యమంత్రి నాయుడు భావించి, ఈ విషయంలో జోక్యం చేసుకుని ఉండడని ఇంకొక వర్గం చెబుతున్నది.

 

  హైదరాబాద్‌లో వందల కోట్ల విలువైన స్థలాలను వీరు కైకర్యం చేయడానికి భారీ కుట్రలు పోలీసులకు అందిన సమాచారం. ఒకే వ్యక్తిని వివిధ పేర్లతో ‘పరిచయం’చేస్తూ సదరు స్థలంపై జీపీఏలు, సేల్‌డీడ్లు తయారు చేయించారు. ఈ వ్యవహారాలపై నమోదైన మొత్తం ఆరు కేసుల్ని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్‌ సక్సేనాతో పాటు మరో నిందితుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios