Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎంపి బుట్టా రేణుక టిడిపి కెళ్తున్నారా?

  • కర్నూలు ఎంపి బుట్టా రేణుక వైసిపికి గుడ్ బై కొడుతున్నారా
  • ఏడాది కిందట సద్దమణగిన రూమర్ ఇపుడు మళ్లీ షికారు
  • నిన్న లోకేశ్ తో ఆమె భేటీ 
  • నేడు జగన్ మీటింగ్ డుమ్మా
is kurnool ycp mp renuka defecting to TDP

కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక వైసీపీకి గుడ్‌బై కొట్టి టిడిపి లో చేరుతున్నారని  మళ్లీ వార్తలొస్తున్నాయి. ఈ సారి వార్తలకు కారణం శుక్రవారం నాడు ఆమె ఐటీ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశం కావడమే దానికి తోడు శనివారం వైసీపీ నిర్వహించిన ఒక ముఖ్యమయిన కార్యక్రమానికి అటెండ్ కాలేదు. దీనితో ఇంకే ముంది ఆమె త్వరలోనే వైసీపీని వీడనున్నారని రూమర్ మొదలయింది.

కర్నూలు జిల్లాకే చెందిన నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైసిసి ఉత్సాహంగా ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ వదంతి మొదలయింది. నంద్యాలలో నెగ్గేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం క్యాబినెట్ ను రంగంలోకి దించాడు. వెనకనుంచి కుమారుడు లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు. దాదాపు అయిదారు వేల్ల కోట్ల విలువయిన హామీలు గుప్పించారు.  ఇలా నంద్యా ల సమరం మధ్యలో వైసిపి ఎంపి పార్టీ వీడుతున్నారనే వార్త వెలువడిండి. ఆమె నుంచి ఇంకా వివరణ రాలేదు. ఆమె ఫోన్లో  కూడా అందుబాటులోకి రాలేదు.

వైసీపీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నాడు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ స మావేవం ఏర్పాటుచేశారు. పార్లమెంటు సభ్యులంతా ఒకేచోట కలిసే ఏకైక సమావేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఇలాంటి కీలక సమావేశానికి బుట్టా రేణుక హాజరు కాకపోవడం వూహాగానాలు మొదలయ్యాయి. ఒక ఏడాది కిండటే బుట్టా రేణుక భర్త బుట్టా నీలకంఠం ఇప్పటికే టిడిపిలో చేరారు. కర్నూలుజిల్లకు చెందిన ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, నంద్యాల ఎంపి ఎస్ పి వైరెడ్డి పార్టీ ఫిరాయించినపుడే ఆమె వెళ్తారనుకున్నారు. అయితే,అలా జరగలేదు. ఏకారణంచేతనో ఆమె వైసిపిలో నే కొనసాగుతున్నారు. అయితే, ఈ రోజు ఆమె వైసిపిపిపి మీటింగ్ కి రాకపోవడం తో ఫిరాయింపు మీద మళ్లీ వూహగానాలుమొదలయ్యాయి. అమరావతిలో బుట్టారేణుక విద్యాసంస్థలకు స్థలం మంజూరు చేయడం గురించి బేరసారాలుసాగుతున్నయని వదంతి.

ఈ వార్తలను  వైసిసి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి తోసిపుచ్చారు. 

అయితే, ఇది మీడియా సృష్టి మాత్రమే నని సాయంకాలనికి తేలిపోయింది. ఆమె కర్నూలు జిల్లా హోళగుందలో ఒక రోడ్ షోల పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటో 

ఇది.

is kurnool ycp mp renuka defecting to TDP

 

Follow Us:
Download App:
  • android
  • ios