ధోనిని కెప్టెన్సీని వదులుకోమని ఒత్తిడి తెచ్చిన సెలక్టర్లు ఎవరు? ఎందుకు, ఎవరికోసం ఒత్తిడి తెచ్చారన్న విషయం మాత్రం తెలియటం లేదు.
పదేళ్ళ పాటు దేశానికి ఎన్నో విజయాలనందించిన సంచలన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చిందా? సెలక్టర్ల ఒత్తిడి మేరకే మహీ కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది తాజా వార్త. గతంలో కూడా పలువురు ఆటాగాళ్ళు, కెప్టెన్లు అర్ధాంతరంగా తప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. అయితే, మిగితావారితో ధోనిని పోలిక చెప్పటం సరికాదు.
పదేళ్ళ క్రితం ధోని అంతర్జాతీయ క్రెకెట్లోకి ప్రవేశించినపుడు విజయాల కోసం జట్టు అవస్తలు పడుతున్నది. అటువంటి సమయంలో టీంలోకి ప్రవేశించిన ధోని తన విలక్షణ ఆటతీరుతో ఎందరినో ఆకట్టుకున్నాడు. ధోని ఆటలో గొప్ప స్టైల్ ఉండదు కానీ జట్టుకు అవసరమైన విజయాలను అందించే సత్తామాత్రం ఉందని అందరూ ఒప్పుకోవాల్సిందే.
వికెట్ కీపర్ బ్యాట్సమెన్ గా జట్టులోకి ప్రవేశించిన మహీ త్వరలోనే టెస్టు జట్టుకు పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత వన్టే జట్టుతో పాటు టి 20 జట్టు సారధ్యాన్ని కూడా అందుకున్నాడు. తన కెప్టెన్సీలో ఎన్నో విజయాలను సాధించిన 36 ఏళ్ళ ధోని తనంతట తానుగా వన్డే జట్టు కూప్టెన్సీని వదులుకున్నారు.
అయితే, అనూహ్యంగా టెస్ట్ జట్టు కెప్టెన్సీకి కూడా ఇటీవలే రాజీనామా చేయటం సంచలనంగా మారింది. ధోని రాజీనామా ప్రకటనపై క్రీడా ప్రేమికులు, విశ్లేషకులు ఆశ్చర్యపోయారు.
తెరవెనుక ఏదో జరిగిందనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే సెలక్టర్ల ఒత్తిడి మేరకే ధోని కెప్టెన్సీ నుండి తప్పుకున్నట్లు ఒక్కసారిగా గుప్పుమన్నది. దాంతో దేశవ్యాప్తంగా సంచలనం మొదలైంది. ధోనిని కెప్టెన్సీని వదులుకోమని ఒత్తిడి తెచ్చిన సెలక్టర్లు ఎవరు? ఎందుకు, ఎవరికోసం ఒత్తిడి తెచ్చారన్న విషయం మాత్రం తెలియటం లేదు.
ఈనెల 15వ తేదీ నుండి ఇంగ్లాడ్ తో వన్డే సీరిస్ మొదలవ్వబోతోంది. అటువంటి సమయంలో ధోని కెప్టెన్సీ నిష్క్రమణపై వివాదాలు రేగటం జట్టుకు ఎంతమాత్రం క్షేమకరంకాదు. ఏమైనా మహేంద్రంసింగ్ ధోని జట్టులోకి రావటమే సంచలనలమైతే, కెప్టెన్ గా నిష్క్రమించటం అంతకన్నా సంచలనం కావటం గమనార్హం.
