Asianet News TeluguAsianet News Telugu

నోట్ల రద్దుకు అమెరికానే కారణమా ?

అమెరికా ఒత్తిడి వల్లో లేకపోతే వీసా, మాస్టర్ కార్డుల ప్రయోజనార్ధమో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు చెబితే జనాలు తిరగబడతారు. అందుకని నోట్ల రద్దుకు మోడి కథలు చెప్పి వాటికి దేశభక్తి ముసుగు వేసారు.

is America behind demonetization

అమెరికా ఒత్తిడికి తలొగ్గే దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసారా? అందుకు నల్లధనం, ఉగ్రవాదం, దొంగ నోట్లు అంటూ నరేంద్రమోడి దేశభక్తి ముసుగువేసారా? తాజా సమాచారం అవుననే చెబుతోంది.

 

అమెరికాలోని వీసా, మాస్టర్ కార్డు సంస్ధల ప్రయోజనార్ధం అమెరికా ప్రభుత్వం ప్రధానిపై ఒత్తిడి తెచ్చి మరీ పెద్ద నోట్లను రద్దు చేయించినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న అసలు విషయాన్ని ‘ఆసియా పసిఫిక్ రీసెర్చ్. కామ్’ బయటపెట్టడం సంచలనంగా మారింది.

 

దేశంలో ప్రస్తుతం నగదు ద్వారానే 97 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీనివల్ల మాస్టర్, వీసా కంపెనీలకు పెద్దగా లాభాలు రావటం లేదు. ఎదుగుతున్న భారత్ కల్పవృక్షంలాగ కనిపించిందేమో. అందుకనే ఒక్కసారిగా క్యాష్ లెస్ లావాదేవీలను పెంచాలని పై సంస్ధలు అనుకున్నాయి.

 

అనుకున్నదే ఆలస్యం దేశంలోని జనాభాను బకరాలను చేసే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ద్వారా మోడిపై ఒత్తిడి మొదలుపెట్టాయి. అందుకు ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పూర్తి సహకారం అందించినట్లు సమాచారం.

 

ప్రచారం ద్వారానో ఇంకేదో రూపంలో తమ కార్డులు వాడండి అంటే జనాలు వాడరు. కార్డులు వాడకపోతే తమకు లాభాలు పెరగవు. అందుకని చెలామణిలో ఉన్న మొత్తం నగదును రద్దు చేయించాలని అనుకున్నాయి.  

 

అనుకున్నదే తడవుగా ఒబామా ద్వారా మోడిపై ఒత్తిడి తెచ్చి అనుకున్నది సాధించాయి. అమెరికా ఆదేశాల ప్రకారమే మన దేశభక్త, 56 ఇంచుల చాతీ కలిగిన మోడి మొన్న నవంబర్ 8వ తేదీన ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేసారు. అంటే, పెద్ద నోట్ల రద్దు వల్ల దేశప్రజలు పడే అవస్తలు కానీ, కుదేలయ్యే దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి గానీ మోడి కనీసం ఆలోచించలేదు.

 

అమెరికా ఒత్తిడి వల్లో లేకపోతే వీసా, మాస్టర్ కార్డుల ప్రయోజనార్ధమో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు చెబితే జనాలు తిరగబడతారు. అందుకని నోట్ల రద్దుకు మోడి కథలు చెప్పి వాటికి దేశభక్తి ముసుగు వేసారు. పిచ్చి జనాలు నిజంగా నమ్మి అవస్తలు పడుతున్నారు.

 

దేశభక్తి ముసుగులో ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారన్న విషయం మోడికి బాగా తెలుసు కాబట్టే దేశప్రజలను తేలిగ్గా గొర్రెలను చేసారు.

 

అందుకనే, తానే చెప్పిన 50 రోజుల తర్వాత దేశంలో పరిస్ధితులు ఏమీ మారకపోయినా దేశప్రజలకు గానీ పార్లమెంట్ కు గానీ మోడి సమాధానం చెప్పటం లేదు. అమెరికా సంస్ధలు అనుకున్నట్లే దేశ జనాభా చచ్చినట్లు కార్డుల వాడకాన్ని పెంచుతున్నారు.

 

మరింత పెంచటం కోసమే రోజు రోజుకు డిజిటల్ లావాదేవీల గురించి అటు మోడి, ఇటు కెసిఆర్, చంద్రబాబులు ఊదరగొడుతుండటం గమనార్హం.

 

Follow Us:
Download App:
  • android
  • ios