Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ ప్ర‌సార హక్కులకు భారీ డిమాండ్ గురు...

  • ఐపీఎల్ ప్రసార హాక్కుల కోసం భారిగా కంపెనీల పోటీ.
  • ఫేస్ బుక్, ట్విట్టర్, యాహులాంటి కంపెనీలు పోటికి దిగాయి.
  • సోమవారం జరగనున్న ఐపీఎల్ ప్రసార హాక్కుల వేలం.
IPL satellite tender huge demand in market

ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోసం కార్పోరెట్ కంపెనీల క‌న్నుప‌డింది. ఒక‌టి కాదు రెండు కాదు ఎకంగా 24 సంస్థ‌లు ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోసం పోటీ ప‌డుతున్నాయి. దేశీయంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఐపీఎల్ ప్ర‌సార హక్కుల కోసం ప‌లు కంపెనీల మ‌ధ్య తీవ్ర పోటి నెల‌కొంది. అందులో ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, అమెజాన్‌, యాహు, ఎయిర్‌టెర్‌, స్టార్‌, సోనీ లాంటి ప‌లు కంపెనీలు ఉండ‌టం వేలంపాట ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తుంది.    

ఐపీఎల్‌ ద్వారా ఆదాయం అధికంగా ఉండటంతో ప్రముఖ సంస్థలన్నీ ప్రసార, డిజిటల్‌ హక్కుల కోసం గట్టిగా పోటీపడనున్నాయి. గ‌తంలో ఐపీఎల్‌ హక్కులను చేజార్చుకున్న స్టార్‌ ఇండియా ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ మరోసారి హక్కులను చేజిక్కించుకోవాలని చూస్తోంది. డిజిటల్‌ హక్కుల కోసం రిలయన్స్‌ జియో డిజిటల్‌, ఎయిర్‌టెల్‌ సంస్థలు రేసులో ఉన్నాయి. ఇవేకాకుండా సెల్లర్‌ సర్వీసెస్‌, ఫాలోఆన్‌ ఇంటరాక్టివ్‌ మీడియా, తాజ్‌ టీవీ ఇండియా, టైమ్స్‌ ఇంటర్‌నెట్‌, సూపర్‌ స్పోర్ట్‌ ఇంటర్నేషనల్‌, గల్ఫ్‌ డీటీహెచ్‌ ఎఫ్‌జెడ్‌ ఎల్‌ఎల్‌సీ, గ్రూప్‌ ఎమ్‌ మీడియా, స్కై యూకే, ఈఎస్‌పీఎన్‌ డిజిటల్‌ మీడియా కూడా టెండర్‌ పత్రాలు కొనుగోలు చేశాయి.


ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల వేలాన్ని ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు బీసీసీఐకీ తాజాగా నోటీసులు జారీ చేసింది, అందుకు అనుగుణంగా సంప్ర‌దాయమైనా ప్ర‌త్య‌క్ష ప‌ద్ద‌తిలోనే ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల వేలం సోమ‌వారం ముంబాయిలో జ‌ర‌గ‌నుంది. ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ ప్రారంభ‌మైన నాటి నుండి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రుత‌లూగిస్తుంది. అదే బీసీసీఐకీ వ‌ర‌మైంది, ప్ర‌తి ఎడాది కోట్లాది డబ్బుల‌ను కెవ‌లం ప్ర‌సార హక్కుల ద్వారానే  సంపాధిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఐపీఎల్ ప్ర‌సార హ‌క్కుల కోసం తీవ్ర పోటీ నెల‌కొంది. 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి  

 

Follow Us:
Download App:
  • android
  • ios