Asianet News TeluguAsianet News Telugu

కొత్త మోడల్ ఐఫోన్ కొంటున్నారా..? ఒక్కసారి ఇవి ఆలోచించండి..

  • 256జీబీ గల ఐఫోన్X ఫోన్ ధర భారత కరెన్సీలో రూ.102,000( లక్షా 2వేలు).
  • స్మార్ట్ ఫోన్ ధర అంత ఎక్కవ ఉన్నప్పటికీ.. దానిని కొనాలనే భావనలో ఉన్నవారు చాలా మందే ఉన్నారు.
  • . మీరు కూడా అదే కోవకు చెందిన వారైతే.. ఒక్కసారి ఇది చదవండి.
iphone x at rs 102000 how about smart moneyfirst

ఐఫోన్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 8ని ఆపిల్ కంపెనీ విడుదల చేసింది. దానితోపాటు ఐఫోన్X ని కంపెనీ విడుదల చేసింది. దసరా కానుకగా అవి భారత మార్కెట్లో సందడి చేయనున్నాయి. అత్యధిక ఫీచర్లతో విడుదల చేసిన ఐఫోన్X ని కొనడానికి ప్రస్తుతం చాలా మంది ఎక్కవ శ్రద్ధ చూపిస్తున్నారు. కొంతమంది అయితే.. ప్రీ బుకింగ్ లు కూడా చేసేసుకున్నారు. 256జీబీ గల ఐఫోన్X ఫోన్ ధర భారత కరెన్సీలో రూ.102,000( లక్షా 2వేలు). స్మార్ట్ ఫోన్ ధర అంత ఎక్కవ ఉన్నప్పటికీ.. దానిని కొనాలనే భావనలో ఉన్నవారు చాలా మందే ఉన్నారు. మీరు కూడా అదే కోవకు చెందిన వారైతే.. ఒక్కసారి ఇది చదవండి.

ఐఫోన్X ఫోన్ చూడటానికి చాలా బాగుంది. దాని ఫీచర్లు చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు ఆ ఫోన్ ని వాడతానా అనే ఆత్రుత మీలో ఉండి ఉండొచ్చు. తప్పులేదు. ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ చాలా అవసరం. ఇంటి కరెంట్ బిల్లు కట్టడం దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకోవడం.. వివిధ రకాల సోషల్ మీడియా వెబ్ సైట్లకు కనెక్ట్ అవ్వడం.. అందమైన సెల్ఫీలు దిగడం లాంటివన్నీ చేయవచ్చు. కానీ.. వీటన్నింటి కోసం రూ.లక్ష ఉపయోగించి ఫోన్ కొనడం ఎంత వరకు అవసరం. పైన చెప్పినవన్నీ సాధారణ స్మార్ట్ ఫోన్ లో కూడా చేయవచ్చు. అలాంటప్పుడు ఐఫోన్X ని రూ.లక్ష కు పైగా వెచ్చించి కొనాల్సిన అవసరం ఉందంటారా ఒకసారి ఆలోచించండి.  ఆ ఫోన్ కొనుగోలు చేసే డబ్బుతో మీ కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం ఏమి చేయెచ్చో ఒకసారి చూద్దాం.

 

జీవిత బీమా

మీ కుటుంబంలో మీ మీద ఆధారపడి జీవిస్తున్నవారు ఉన్నారా.. అలా ఉంటే.. ఐఫోన్X  కొనాలనుకున్న నగదుతో వారికి ఒక జీవిత    బీమా తీసుకోవచ్చు. ఈ ఇన్ సూరెన్స్ ద్వారా మీ కుటుంబ సభ్యుల జీవితానికి ఒక భద్రత కలిగించిన వారౌతారు. మీ మయసు గనుక 30 సంవత్సరాలు అయితే రూ.2కోట్ల బీమా.. 30 సంవత్సరాలకు తీసుకోవచ్చు. ప్రీమియం రూ.21వేలతో ప్రారంభం అవుతుంది. ఈ   బీమా చెల్లించడం ద్వారా.. మీ భార్య, పిల్లలకు ఒక సెక్యురిటీ కల్పించిన వారౌతారు. అది మీ పిల్లల చదువు కూడా ఉపయోగపడుతుంది.

ఆరోగ్య బీమా..

ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేసే అందరికీ  వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా ఉంటోంది. 2016వ సంవత్సరంలో ఒక సర్వే తెలిపిన వివరాల ప్రకారం మన దేశంలో 80శాతం మంది ఆరోగ్య బీమాల కారణంగా చికిత్సలు పొందుతున్నారట. 66శాతం మంది ధనవంతులు కూడా ఆరోగ్య బీమాతో చికిత్సలు పొందారట. ఈ ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల.. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అయ్యే హాస్పిటల్ ఖర్చు ఇన్ సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. తద్వారా మీరు చేసుకున్న సేవింగ్స్ హాస్పిటల్ పాలు కాకుండా ఉంటాయి.

ఐఫోన్X ఫోన్ కి పెట్టే ఖర్చుతో ప్రీమియర్ల వారీగా రూ.5లక్షల ఆరోగ్య బీమా.. మీ భర్త/భార్య, పిల్లల పేర్ల మీద తీసుకోవచ్చు.ఈ పాలసీ ప్రీమియం రూ.11,500 నుంచి ప్రారంభమౌతుంది. మీకు వివాహం కాకపోయినట్లయితే.. కేవలం మీ వరకు కూడా ఆరోగ్య  బీమా తీసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్స్...

పెట్టుబడులకు సరైన మార్గం మ్యూచువల్ ఫండ్స్. రూ.500 తో కూడా మీరు మీ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టవచ్చు. నెల నెలా దీనిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదా సంవత్సరానికి ఒక సారి, రెండు సార్లు కూడా చేయవచ్చు. దీనిలో అవసరమైనప్పుడు నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ క్యాటగిరిలో పెట్టుబడులు పెడితే లాంగ్ టర్మ్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. గత పది సంవత్సరాలుగా అందులో 10-15శాతం రిటర్న్స్ వస్తున్నాయి. అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనే బదులు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి మీ లైఫ్ గోల్స్ ని ఫుల్ ఫిల్ చేసుకోవచ్చు.

లోన్స్ పూర్తి చేయవచ్చు..

గత మూడేళ్లుగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పట్టాయి. గత నెల ఆగస్టులో కూడా కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇలాంటి సమయంలోనే మీరు తీసుకున్న హోమ్ లోన్, కార్ లోన్ లాంటి వాటిని పూర్తి చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కొనే డబ్బుతో  లోన్ కి కట్టేస్తే.. వాటి భారం తగ్గే అవకాశం ఉంటుంది.

అత్యవసర  ఫండ్..

అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, యాక్సిడెంట్ కావడం, ప్రాపర్టీ డ్యామేజ్ లాంటివి అనుకోకుండా జరిగిపోతాయి. మనకు చెప్పి జరగవు. అలాంటి సమయంలో వాటి నుంచి కోలుకోవడానికి అత్యవసరంగా డబ్బు అవసరమౌతుంది. ఇలాంటి ఎదురైనప్పుడు తట్టుకోవాలంటే ఎమర్జెన్సీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో చేస్తే.. అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చు. మీకు రెగ్యులర్ గా నెలకు వచ్చే జీతం కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. మరో ఉద్యోగం లభించే వరకు.. లేదా ప్రమాదానికి చికిత్స చేయించుకోవడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. ఆ నగదుతో ఇంటి రెంట్, ఈఎంఐలు చెల్లించుకోవచ్చు.

 ఇవన్నీ కాదు.. అంతగా మనీ ఎక్కువగా ఉన్నాయనుకుంటే.. బంగారం లాంటివి కొనుగోలు చేయండి. అవి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి.

వీటన్నింటి గురించి పూర్తిగా ఆలోచించి.. ఇవన్నీ మేము ముందే చేసేసుకున్నాము. వీటిని మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే.. మీకు నచ్చిన ఐఫోన్X ఫోన్ ని సంతోషంగా కొనుగోలు చేసుకోవచ్చు.

 

అథిల్ శెట్టి, బ్యాంక్ బజార్. కామ్ సీఈవో

Follow Us:
Download App:
  • android
  • ios