''ఫీజులు తగ్గించకుంటే పరీక్షలు బహిష్కరిస్తాం''

intermediate private colleges management association dharna at intermediate board office
Highlights

  • ఆందోళనకు దిగిన తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్
  • పెంచిన పరీక్ష ఫీజులు తగ్గించాలని డిమాండ్

 ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజులను పెంచడాన్ని నిరసిస్తూ నాంపల్లి లోని ఇంటర్ బోర్డ్ ముందు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. ఫీజులు తగ్గించకుంటే ఇంటర్మీడియట్ సబ్లిక్ పరీక్షలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విద్యార్థులు అనేక రకాల ఫీజులు కడుతుండగా ఈ ఫెంచిన పీజులు విద్యార్థులకు భారంగా మారనున్నాయని పేర్కొన్నారు. వెంటనే వీటిని తగ్గిస్తే విద్యార్థులతో పాటు, కళాశాలలపై పడుతున్న భారాన్ని తగ్గించినట్లవుతుందని అన్నారు.
ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డ్  పరీక్ష ఫీజులను , కాలేజ్ రికగ్నైషన్ పీజులను పెంచింది. దీనివల్ల అటు విద్యార్థులు, ఇటు కళాశాలల యాజమాన్యాలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు.  అందువల్ల పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాంపల్లి లోని బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.  
 

loader