ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ బాగానే ఐడియాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఒకరిని చూసి ఒకరు  స్ఫూర్తి పొందుతున్నారు. తాజాగా కాళేశ్వరం  ప్రాజక్టును హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కూర్చునే కెసిఆర్ రిమోటో రివ్యూ చేశారు.  ఈ రోజు కెసిఆర్ స్ఫూర్తితో  ఆసుపత్రి పడకల  మీద రోజుకో రంగు దుప్పటి పథకం నాయుడు ప్రవేశపెడుతున్నారు. మొదట ఒంగోలు రిమ్స్ లో మొదలు.

ఈ విధానం మొదలుపెట్టింది ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన పోలవరం 2018 నాటికో, కనీసం 2019 ఎన్నికల నాటికో మొదటి దశ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది పూర్తయి నీళ్లు పారితే, ఎన్నికల్లో గెలవడం సులువని ఆయన భావిస్తున్నారు. అందుకే ప్రతిసోమవారం ఆయన వెలగపూడి ఆఫీసులో కూర్చుని పోలవరం సమీక్ష చేస్తున్నారు. అంతా రిమో ట్ వ్యవహారమే. ప్రాజక్టు సైట్ వద్ద ఇంజనీర్ల పనులు జరిగే చోట కెమెరాలు అమర్చారు. అక్కడి నుంచి వారు పనుల గురించి వివరిస్తారు. అంతేకాదు, కొన్ని సార్లు ఆయన డ్రోన్లను కూడా ప్రయోగించారు. డ్రోన్ లకు అమర్చిన కెమెరాలనుంచి కూడా ప్రాజక్టును విహంగ వీక్షణం చేశారు. ఇక ప్రతిసోమవారం పోలవరం రివ్యూ జరుగుతుంది కాబట్టి, సోమవారానికి పోలవారం అని ముద్దుగా పిలవడం మొదలుపెట్టింది, ఆయన ప్రచార బృందం.

కాళేశ్వరం రివ్యూను ఈ స్థాయిలో కాకపోయిన, ప్రాజక్టు వద్ద అమర్చిన కెమెరాల సహయంతో , ప్రగతి భవన్ లో ఏర్పాటుచేసిన పెద్ద పెద్ద స్క్రీన్ ల మీద కెసిఆర్ చూశారు. వచ్చే సమీక్ష నాటికి డ్రోన్లు కూడా రావచ్చని చెబుతున్నారు.

అయితే, ఇపుడు చంద్రబాబునాయుడు కూడా అంతే స్ఫూర్తితో కెసిఆర్ ఆర్భాటంగా ప్రారంభించిన ఒకపథకాన్ని ఆంధ్రాలో ప్రారంభించబోతున్నారు. అది, ఆసుపత్రి పడకల మీద రోజూ దుపట్లు మార్చడం. దీనికోసం రోజుకొక కలర్ దుప్పటి మారుస్తారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క రంగు దుప్పటి వుంటుంది. ఆ రోజు దప్పటి రంగు నుబట్టి మార్చారో లేదో తెలుస్తుంది. దీనిని మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తెలంగాణాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇదే విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదట ఒంగోలు లోని రిమ్స్ లో ప్రారంభిస్తారు. రిమ్స్ లో 600 పడకలున్నాయి. వాటికి రోజుకొకటిచొప్పున ఉతికిన దుప్పట్లు సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్ తో మాట్లాడారు. వారం ఏడురోజులలో ఏడు రంగుల దుప్పట్లు ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు దుప్పటి ఉంటుంది. ఈ రోజ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ నిర్ణయం జరిగింది.