భారత దేశంలో నలుమూలలు మెచ్చిన టిపిన్ ఐటెం... పేపర్ పల్చగా, దోరగా వేగి కరకరలాడుతూ కనిపించే దోసెయే.. అది మసాలా కావచ్చు,సాదా కావచ్చు, ఈ మధ్య వివిధ అవతారెత్తున్న దక్షిణ భారత దోసెయే. టిపిన్ లో ఇపుడు అంటే దోసే అయిపోయింది. ఢిల్లీ, ముంబయ్, కోల్ కత్తా, పుణే, చెన్నె, బెంగుళూరు, ఆపైన హైదరాబాద్ ... పొద్దనే టిఫిన్ తెప్పించుకోవాలంటే, మొదటి ఆర్డర్ పడుతున్నది దోసే మీదే.
భారత దేశంలో నలుమూలలా మెచ్చిన టిపిన్ఐటెం... పేపర్ పల్చగా, దోరగా వేగి కరకరలాడుతూ కనిపించే దోసేయే.. అది మసాలా కావచ్చు,సాదా కావచ్చు, ఈ మధ్య వివిధ అవతారెత్తున్న దక్షిణ భారత దోసెయే. టిపిన్ లో ఇపుడు అంతా దోసే కావాలంటున్నారు.ఢిల్లీ, ముంబయా, కోల్ కత్తా, పుణే, ఛెన్నె, బెంగుళూరు, ఆపైన హైదరాబాద్ ... పొద్దనే టిఫిన్ తెప్పించుకోవాలంటే, మొదటి ఆర్డర్ పడుతున్నది దోసే మీదే. కొబ్బరి చట్నీ తో, వేరశనక్కారం, కారం ప్పొడి, ఎర్రకారం, సాంబార్, అల్లం చట్నీ... ఆనియన్, పన్నీర్, డ్రైఫ్రూట్, ఎగ్, చికెన్ మటన్, రొయ్యలు...ఎవరి ఇష్టానికయినా అణకువగా వొదిగిపోయే దోసే ఇపుడు ఆల్ ఇండియా మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ ఐటెం అంటున్నారు స్విగ్గీ. దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్ల మీద ఆన్‌లైన్ సర్వే చేస్తే దోసే కే ఎక్కువ వోట్లు పడ్డాయి. ఒకవేళ దోశ లేదనుకుంటే మాత్రం అప్పుడు పోహా, పరోటాలు తీసుకుంటున్నారు.వినియోగదారులెక్కుగా కోరుకుంటున్నది, కొంటున్నది దోసేనే.
స్విగ్గీ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఈ సర్వే చేసింది. ఢిల్లీ, ముంబై, పుణె, చెన్నై, బెంగళూరు, హైదరాబా లాంటి నగరాల్లో కూడా ముందు దోసే టాప్ ప్రయారిటీ. ఢిల్లీ జనాలు మాత్రం దాంతోపాటు చోళే భటూర ఆర్డర్ ఇస్తుంటే.. ముంబై వాళ్లు బన్ మస్కా కోరుతున్నారు. పుణె వాళ్లకు సాబుదానా కిచిడీ ఇష్టం. బెంగళూరుచాయస్ మసాలాదోశ, ఇడ్లీ వడ, పోహా.
దోసెలలో తగినంతగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్ ఉంటాయని.. అందువల్ల అది ఆరోగ్యరీత్యా కూడా మంచిదని ఇండియన్ డయెటిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు షీలా కృష్ణస్వామి అంటున్నారు. వారాంతాలలో దోశ ఆర్డర్లు మరింత ఎక్కువ. మామూలు రోజుల్లో కంటే వారాంతాల్లో అయితే 30 శాతం ఎక్కువమంది వినియోగదారులు రకరకాల దోశలు కావాలని అడుగుతున్నటుల సర్వే లో తేలింది. మామూలు రోజుల్లో చూసుకుంటే సోమ, మంగళవారాల్లో ఎక్కువమంది దోసే బయట టిఫిన్లు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ఇళ్లలోనే చేసుకుంటున్నారట.
