తానేమీ పార్ట్ టైం రాజకీయ నాయకుడిని కాదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, తన ఉద్యోగుల కోసమే సినిమాలు చేస్తున్నాని తెలిపారు.

జనసేన అధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ రోజు అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలతో ముచ్చటించారు.

దాదాపు 150 మంది క్రీయాశీల కార్యకర్తలను పేరుపేరున పలకరించి వారిని ఆశ్చర్యానికి గురిచేశారు.

తాను పార్ట్ టైం పొలిటీషన్ ను అని చాలా మంది విమర్శిస్తున్నారని, అయితే రాష్ట్రంలో ఎంతమంది ఫుల్ టైం పొలిటీషన్లు ఉన్నారో చెప్పాలన్నారు.

ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారందరూ పార్ట్ టైం పొలిటీషన్లేనని విమర్శించారు.

కోట్లు కోట్లు కూడబెట్ట ఇంట్లోంచి బయటకురాని రాజకీయనాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారన్నారు.

తానేమీ పార్ట్ టైం రాజకీయ నాయకుడిని కాదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, తన ఉద్యోగుల కోసమే సినిమాలు చేస్తున్నాని తెలిపారు.

రాజకీయాలకు ఆటంకంగా మారితే సినిమాలను వాయిదా వేయడానికి వెనకాడనని ప్రకటించారు.

అనంతపురం జిల్లా నుంచే మొదటిసారి పార్టీ సభ్యత్వ నమోదు మొదలుపెట్టామని గుర్తు చేశారు.

ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు త్వరలోనే అనంతపురం జిల్లా నుంచే పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

ఎన్ని ఆటంకాలొచ్చినా అనంతపురం జిల్లా నుంచే ఎన్నికలకు పోటీ చేస్తానని మరోసారి తెలిపారు.