హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చేది చార్మినార్.. ఆ తర్వాత  బిర్యానీనే. అసలు సిసలు బిర్యానీ రుచి చూడాలంటే ఎవరైనా హైదరాబాద్ రావాల్సిందే. అంతలా ప్రాచుర్యం పొందింది. ప్రధానులు, ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, సినీతారలు ఎందరెందరినో మెప్పించిన నగర వంటకం ఇది. నగరాన్ని సందర్శించిన ఏ పర్యాటకుడూ బిర్యానీ రుచిచూడకుండా వెనుదిరగడంటే అతిశయోక్తి కాదు.హైదరాబాదీ పాకశాల ఘుమఘుమలు అలాంటివి మరి.

ప్రస్తుతం నగరంలో చాలా ప్రాంతాల్లో బిర్యానీ లభిస్తోంది. అయితే.. ది బెస్ట్ హైదరాబాద్ బిర్యానీ మాత్రం అన్ని చోట్లా దొరకదు. అలా దొరికేవి నగర వ్యాప్తంగా ఐదు హోటళ్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దామా..

1. హోటల్ ఆదాబ్ బావర్చీ కుహానా

నాంపల్లి హౌస్ కి సమీపంలో ఉంటుంది ఈ హోటల్ ఆదాబ్. ఉదయం ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, మధ్యాహ్నం భోజనం, బిర్యానీ .. ఇలా ఈ హోటల్ లో లభించే ప్రతి ఒక్కటీ హైదరాబాద్ ప్రత్యేకతను తెలియజేస్తాయి. ఇక్కడ లభించే బిర్యానీ రుచి, దాని ఫ్లేవర్ మరెక్కడా లభించదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఇక్కడికి జనాలు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.

2. హోటల్ షాదాబ్

అసలు సిసలు హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాలంటే ఈ షాదాబ్ హోటల్ కి వెళ్లండి. బాగా ఆకలివేసినప్పుడు కనుక ఇక్కడికి వెళ్లారంటే కడుపునిండా బిర్యానీ తినేయచ్చు. హైకోర్టు రోడ్డులోని మధీనా బిల్డింగ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ధమ్ బిర్యానీ స్పెషల్ ఇక్కడ. శనివారం రోజు మాత్రం ప్రత్యేకంగా చికెన్ నిహారీ లభిస్తుంది. ది బెస్ట్ కుబానీ కా మీటా కూడా ఇక్క దొరుకుతుంది. ఈ హోటల్ కి బాగా ప్రాచుర్యం రావడంతో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో మరో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు.

3. షాఘోస్ కేఫ్

హలీమ్ కి ఫేమస్ ఈ షాఘోస్ కేఫ్. అయితే ఇక్కడ హలీమ్ తో పాటు ది బెస్ట్ బిర్యానీ, ఇరానీ ఛాయ్ కూడా లభిస్తుంది. చార్మినార్ కి ఒక కిలోమీటర్ దూరంలో షాలిబండ రోడ్డులో ఈ హోటల్ ఉంది.

4.హోటల్ సోహైల్

ఈ హోటల్.. మలక్ పేట లో ఉంటుంది. బిర్యానీ, హలీమ్ తినీ తినీ బోర్ కొట్టిన వాళ్లకు ఈ హోటల్ లో లభించే ఫుడ్ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ తో వెళ్లి తినిరావడానికి సౌకర్యంగానూ ఉంటుంది.

5.కేఫ్ బాహర్

బహీర్ బాగ్ లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంది ఈ కేఫ్ బాహర్. ఇందులో చికెన్, ఎగ్ బిర్యానీ చాలా స్పెషల్. అంతేకాదు మటన్, ఫిష్ కూడా లభిస్తుంది. మీరు కనుక నాన్ వెజ్ ప్రియులైతే ఒక్కసారైనా ఈ కేఫ్ కి వెళ్లాల్సిందే.