హైదరాబాద్.. పేరుకే మహానగరం.. ఒక గంట వర్షం పడితే చాలు.. రోడ్లు మొత్తం జలమయం. వర్షం పడిన తెల్లారి చూస్తే.. డ్రైనేజీలకు రోడ్డుకీ పెద్ద తేడా ఏమీ కనపడదు. మొత్తం రోడ్లన్నీ గుంతలమయమే. మళ్లీ రోడ్లు వేయండి మహాప్రభో.. అంటూ నగరవాసులు ఎంత మొత్తుకున్నా.. అధికారులు వినీ విననట్టు వ్యవహరిస్తున్నారు. ఇక పాలకులైతే.. అప్పుడు వేస్తాం.. ఇప్పుడు వేస్తాం అంటూ కహానీలు చెబుతుంటారు. నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెప్పడమే తప్ప ఈ మూడున్నరేళ్ల కాలంలో ఆ దిశగా చేసిందేమీ లేదు. అలాంటిది ఒక్కసారిగా ఇప్పుడు హైదరాబాద్ నగరమంతా సుందరంగా తయారౌతోంది. కొత్తగా రోడ్లు వేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ లేకుండా అంతా రోడ్లన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతున్నాయి. నగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు మంత్రులు కూడా అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇంత సడెన్ చేంజ్ ఎందుకొచ్చిందో తెలుసా..? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కారణంగా.

అసలు విషయం ఏమిటంటే.. హైదరాబాద్ వేదికగా నవరంబర్ 28న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాంక హైదరాబాద్ రానున్నారు.  ఆమె ఫలక్ నుమా ప్యాలెస్ లో బస చేయనున్నారు. అయితే.. ఆమె రాకను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ని సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇదే విషయాన్ని ఓ యువకుడు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు. ఏకంగా ఇవాంకా ట్రంప్ కే మెసేజీ పెట్టాడు. ఇవాంకా ట్రంప్ ని ఉద్దేశిస్తూ.. ఆమె హైదరాబాద్ వస్తునందుకు దన్యవాదాలు తెలిపాడు. ఆమె రాకను పురస్కరించుకొని హైటెక్ సిటీ పరిసరాల్లోని రోడ్లను ఎలా ఆధునీకరించారో అతను అందులో తెలియజేశాడు.గత రెండు రోజులుగా తమకు ట్రాఫిక్ సమస్య రావడం లేదని కూడా చెప్పాడు.   హైదరాబాద్ కి సంవత్సరానికి రెండు సార్లు  రావాలంటూ ఆ వ్యక్తి ఇవాంకాను కోరాడు. హైదరాబాద్ యువకుడి పోస్టు.. కింద చదవండి