Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కు ఏమయిందబ్బా?

హైదరాబాద్ లో లిక్కర్ షాపుల కోసం పెద్దగా పోటీ లేదు

hyderabad lagging in liquor shop auctions

కొంచెం తీరుబడి గా నాలుగు గుక్కలు నోట్లో వేసుకునేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది.  పదిగంటల దాకే వైన్ తెరిచినందు వల్లచాలా మంది లేట్ కమర్స్ రిలాక్సయ్యే అవకాశమేలేకుండా పోతున్నదని గుర్తించి వైన్ షాపులను పదకొండ గంటలదాకా తెరచిపెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  అయినా, హైదరాబాద్ లో  వైన్ షాపులు తెరిచేందుకు పెద్దగా పోటీ లేదు. మెట్రోపాలిటన్ హౌదరాబాద్ కంటే చట్టుపక్కల జిల్లాలో వాళ్లే యమ హుశారుగా వేలానికి సై అంటున్నారు. హైదరాబాద్‌లో 176 మద్యం దుకాణాలకుగాను 176 దరఖాస్తులే వచ్చాయి. ఒక్కటి కూడా ఎక్కువ రాలే.ఏమయింది హైదరబాదోళ్లకు అని అధికారులు ఆశ్చర్య పోతున్నారు. వచ్చే నెల అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి వస్తాంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న  2216 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు  ఈ నెల 13 నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలయింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసింది. రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే  31 జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో సుమారు 30 వేల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఫీజే  రూ.300 కోట్లు రావడం విశేషం. దరఖాస్తులలో నల్గొండజిల్లా నెంబర వన్. నల్లగొండ జిల్లా (మూడు కొత్త జిల్లాలు కలిపి) 276 దుకాణాలకుగాను ఏడు వేల దరఖాస్తులు వచ్చాయి. తర్వాత స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 412 మద్యం దుకాణాలకుగాను 4 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. అతి తక్కువ  హైదరాబాద్‌ నుంచే వచ్చాయని అధికారులు నిరుత్సహంగా చెబుతున్నారు. హైదరాబాగ్ జిల్లా పరిధిలో 176 మద్యం దుకాణాలుంటే 176 దరఖాస్తులు మాత్రమే వచ్చాయిని ఇందులో ఏదో మతలబు ఉందని వారు అనుమానిస్తున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రుసుం లక్ష రూపాయాలకు డిడి అందజేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులు మొత్తం 30 వేలకు చేరుకోవడంతో వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 300 కోట్ల ఆదాయం వచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios