భార్య వేధింపులతో గోదావరిలో దూకి భర్త ఆత్మహత్య

భార్య వేధింపులతో గోదావరిలో దూకి భర్త ఆత్మహత్య

వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందు ఇద్దరి మద్య వున్న ప్రేమ పెళ్లి తర్వాత ఆవిరైపోయింది. ప్రేమగా కబుర్లు చెప్పుకునే వారు కాస్తా గొడవలు పడే స్థాయికి వెళ్లింది. దీంతో భార్యా భర్తల మద్య గొడవలు ఎక్కువవడంతో భర్త గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరణ్ కుమార్‌, రాజమహేంద్రవరానికి చెందిన రమ్య అనే యువతి ప్రేమించుకున్నారు. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట  రాజమహేంద్రవరంలోనే కాపురం పెట్టింది. వీరికి ఒక బాబు, ఒక కూతురు సంతానం. అయితే ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న వీరు పెళ్లి తర్వాత ప్రతి చిన్న విషయానికి గొడవపడేవారు. అంతే కాకుండా కరణ్ చేస్తున్న సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం, కొనుగోలు బిజినెస్ కూడా నష్టాలబాట పట్టింది. దీంతో ఇతడు తీవ్ర మనోవేధనకు గురై మద్యానికి బానిసయ్యాడు.

ఇటీవల కరణ్ కుమార్‌ తన స్నేహితుడు వీరేంద్రతో కలిసి బిజినెస్ పనిమీద కొవ్వూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో భార్యతో ఫోన్  చేసి గొడవకు దిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన కరణ్ స్నేహితుడితో మూత్ర విసర్జన చేసి వస్తానని చెప్పి కొంత దూరం వెళ్లి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos