ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ హెచ్ టీసీ... భారత మార్కెట్లోకి తాజా స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. హెచ్ టీసీ యు11 ప్లస్ పేరుతో ఈ ఫోన్ ని మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది. ప్రస్తుతానికి సిల్వర్‌కలర్‌ వేరియంట్‌మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే సెరామిక్‌ బ్లాక్‌ కలర్‌లో కూడా అందుబాటులోఉంటుందని కంపెనీ ప్రకటించింది.  ఇక దీని ధర 56,990 రూపాయలుగా ఉండనుంది. 4జీబీ, 6జీబీ వేరియంట్లలో దీన్ని లాంచ్‌  చేసింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో కూడా వెల్లడించింది. ఈ ఫోన్ ఫీచర్లను తెలియజేసే వీడియోని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


హెచ్ టీసీ యు11+ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...
6 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ  సూపర్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440x2880 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియో
4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌
6జీబీ /128జీబీ స్టోరేజ్‌
12 ఎంపీ అల్ట్రా మెగా పిక్సెల్‌ కెమెరా విత్‌ ఆటో ఫోకస్‌
8ఎంపీ సెల్పీ కెమెరా
3930 ఎంఏహెచ్‌ బ్యాటరీ