10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఈ రోజు రూ.200 తగ్గి రూ.28,300 గా పలికింది.

ఏడాది చివరి రోజున బంగారం ధర తగ్గింది. గత వారం రోజులుగా పసిడి ధర పెరుగుతూ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా నాలుగు రోజులుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు మాత్రం పెరుగుదలకు బ్రేక్ పడింది.

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఈ రోజు రూ.200 తగ్గి రూ.28,300 గా పలికింది.

వెండి ధర కూడా ఇదే ధోరిణిలో కనిపించింది. కిలో వెండి రూ.500 తగ్గి రూ. 39,400 వద్ద ఆగింది.

బంగారం ధర నవంబర్‌ 9న రికార్డు స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే.