మహిళలను కించపరిచేలా ఎన్నో సీన్లలో నటించిన హీరో అక్షయ్ ఇప్పుడు బెంగుళూరు ఘటనపై నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.


బెంగళూరు ఘటనపై హీరోలందరూ తెగ ఇదైపోయారు. మగాడిగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటున్నామంటూ వాపోయారు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అయితే వీడియో పోస్టు పెట్టి భారీ డైలాగులు కొట్టారు.‘చిన్న‌గా ఉన్న‌వి మ‌హిళ‌ల దుస్తులు కాద‌ని.. మీ ఆలోచ‌న‌ల‌ని బెంగళూరు కుర్రాళ్లను

ఉతికిఆరేశాడు. 

ఈ ఘ‌ట‌న చూస్తే మ‌నం వెన‌క్కి అడుగులు వేస్తున్నామేమో అనిపిస్తోంద‌ని, మ‌నుషులు జంతువులుగా కూడా కాదు క్రూర మృగాలుగా మారుతున్నార‌ని రెచ్చిపోయాడు.

http://newsable.asianetnews.tv/video/dear-akshay-never-mind-bengaluru-you-have-much-to-be-ashamed-of

నిజంగా బెంగళూరు ఘటనపై అక్షయ్ మాటలతో అందరూ ఏకీభవించాల్సిందే. మరి, అక్షయ్ తన సినిమాలో అలాంటే వేషాలే వేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా...

బెంగళూరు ఘటన కంటే కాస్త ఎక్కువగానే అక్షయ్ రోమాంటిక్ సీన్ లు ఇలా కొన్ని సినిమాలలో దర్శనమిచ్చాయి. బహుశా దీన్నే గురువింద గింజ నీతులు అంటారనుకుంటా.