Asianet News TeluguAsianet News Telugu

బ్రాంది రెండు పెగ్గులేసుకుంటే మంచిదే..

  • వైను లేదా పళ్ళ గుజ్జు నుండి శుద్ధి చేసి తీసిన సారాయి(స్పిరిట్).మొదట కొంచెం శుద్ధి చేసాకా చెక్కపెట్టెలలో చాలాకాలం పాటు నిల్వ చేస్తారు. దీనివల్ల బ్రాందీ కి ఒక ప్రత్యేక మైన జేగురు రంగు వస్తుంది.16 వ శతాబ్దం లో మొట్టమొదట బ్రాందీ తయారు చేశారు. బ్రాందీలో 50శాతం ఆల్కహాల్ ఉంటుంది.
Health Benefits of Brandy

‘‘ మద్యపానం ఆరోగ్యానికి హానికరం’’ ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే.. మద్యపానంతో ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు నేటి కాలం శాస్త్రవేత్తలు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. కాకపోతే.. మీరు గమనించాల్సింది ఏమిటంటే.. అన్ని రకాల మద్యం ఆరోగ్యానికి మేలు చేయవు.. పైగా హాని చేస్తాయి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. బ్రాందీ తాగడం వల్ల మనిషి ఆరోగ్యంగా జీవించగలడు. బ్రాందీ తాగినవాళ్లు.. తాగని వాళ్లకన్నా ఒక ఐదు సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతున్నాడని సర్వేలో తేలింది. అసలు ఈ బ్రాందీ కథేంటి? బ్రాందీ తీసుకోవడం వలన కలిగే లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం..

Health Benefits of Brandy

వైను లేదా పళ్ళ గుజ్జు నుండి శుద్ధి చేసి తీసిన సారాయి(స్పిరిట్).మొదట కొంచెం శుద్ధి చేసాకా చెక్కపెట్టెలలో చాలాకాలం పాటు నిల్వ చేస్తారు. దీనివల్ల బ్రాందీ కి ఒక ప్రత్యేక మైన జేగురు రంగు వస్తుంది.16 వ శతాబ్దం లో మొట్టమొదట బ్రాందీ తయారు చేశారు. బ్రాందీలో 50శాతం ఆల్కహాల్ ఉంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. బ్రాందీ తాగడం వలన శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు లాంటి రోగాలు తరచూ రాకుండా ఉంటాయి. అంతెందుకు కొన్ని రకాల జలుబు, దగ్గు వంటి రోగాలకు ఇచ్చే మందుల్లో బ్రాందీని ఉపయోగిస్తారు. ఎక్కువ మొత్తంలో కాకుండా.. మితంగా బ్రాందీ  తీసుకుంటే.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. ఇతర ఇన్ ఫెక్షన్ లపై పోరాడతుంది.

హాయిగా నిద్ర.. ప్రస్తుత రోజుల్లో వర్క్ టెన్షన్స్, ట్రాఫిక్ తదితర కారణాల వల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గ్లాస్ బ్రాందీ కనుక తీసుకుంటే.. వారికి నిద్రలేమి సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది. బ్రాందీ వల్ల శరీరానికి రిలాక్సేషన్ లభిస్తుంది. అంతేకాదు బాడీ పెయిన్స్ కూడా తగ్గించేస్తుంది.

క్యాన్సర్ పై పోరాటం.. బ్రాందీలో ఎలాజిక్ అనే యాసిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకాలపై పోరాటం చేస్తుంది. కాబట్టి కొద్ది మొత్తంలో బ్రాందీ తీసుకోవడం వల్ల అన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉండవచ్చు.

యాంటీ ఏజినింగ్.. వయసు పెరుగుతున్నా కూడా యవ్వనంగా కనిపించేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివాళ్లు.. బ్రాందీ వైపు ఓ కన్ను వేయవచ్చు. ఎందుకంటే.. బ్రాందీ తాగడం వల్ల  చర్మం, ఫేస్ లో గ్లో పెరుగుతుంది. దీంతో ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు.

గుండె... మద్యం తాగితే.. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని అందరూ చెబుతుంటారు. అయితే.. బ్రాందీ తాగడం వల్ల గుండెను రక్షించుకోవచ్చు. బ్రాందీలో యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

జలుబు, దగ్గు.. జలుబు, దగ్గులాంటి వాటితో బాధపడుతున్నవారు ఒక్కసారి వైన్ తాగితే.. అవి పటా పంచల్ అయిపోతాయి.  దాదాపు అన్ని దగ్గు మందుల్లోనూ వైన్ వాడతారన్న విషయం అందరికీ తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios