‘‘చిట్లం పొడి’’... ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఇది రాయలసీమ స్పెషల్ పొడి.  జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లోకి ది బెస్ట్ కాంబినేషన్ ఈ చిట్లం పొడి.  అంతేకాదండోయ్... వేడి వేడి అన్నంలో ఈ పొడి కలుపుకొని కొద్ది నెయ్యి వేసుకొని తింటే.. దాని రుచే వేరు. చదువుతుంటే మీకు కూడా నోరు ఊరుతోంది కదూ. నిజంగానే చాలా రుచిగా ఉంటుంది.

అంతెందుకు ఏదైనా కూరగాయ ఫ్రై చేసినప్పుడు ఈ పొడిగా కొద్దిగా చల్లండి.. కూర రుచి రెట్టింపు కావడం ఖాయం. ఈ కాలం పిల్లలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద బ్రెడ్ తినడానికి బాగా అలవాటుపడ్డారు. అలాంటి వాళ్లు.. బ్రేడ్ మధ్యలో జామ్ కి బదులు నెయ్యితో కలిపి ఈ పొడిని పెట్టుకొని ఒక్కాసారి తిన్నారంటే.. మళ్లీ వదిలిపెట్టరంటే నమ్మండి. ఇలా ఆల్ ఇన్ వన్ గా ఉపయోగపడుతుంది. బాగా ఆకలివేస్తున్న సమయంలో.. కూర చేసుకునే ఓపిక లేకపోతే కూడా ఇది ఇన్ స్టాంట్ గా ఉపయోగపడుతుంది. ఒక్కసారి చేసి పెట్టుకుంటే.. చాలా కాలం నిల్వ ఉంటుంది కాకపోతే తడి తగల కుండా చూసుకోవాలి. మరి ఈ చిట్లం పొడి తయారీ విధానం ఒకసారి చూసేద్దామా..

వేయించిన వేరుశెనగ పప్పులు, వేయించిన ఎండు మిరపకాయలు, కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు. ఇవన్నీ కలిపి మిక్సీలో మెత్తగా పొడి చేయండి. అంతే.. చిట్లం పొడి రెడి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.