భారత మాజీ నేవీ ఉద్యోగి కులభూషణ్ జాదవ్ కు పాకిస్తాన్ విధించిన ఉరిశిక్ష నుంచి స్టే విధిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పునివ్వడంతో భారత్ లో ఆనందోత్సవాలు వెల్లివిరిస్తున్నాయి.

 

ఈ కేసుతో మన దాయాది పాక్ కుటిల నీతి అంతర్జాతీయంగా మరోసారి బట్టబయలైనట్లైంది.

 

అయితే కుల్ భూషణ్ జాదవ్ ను శిక్ష నుంచి తప్పించడంలో మన లాయర్లు చేసిన కృషిని ఈ సందర్భంగా కచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి.

 

ఈ కేసుకు సంబంధించి భారత్ తరఫున అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదించిన వ్యక్తి హరీష్ సాల్వే.

 

ఇంతకీ ఈయనెవరో తెలుసా.... దేశంలోని ప్రముఖ, అత్యంత ఖరీదైన లాయర్లలో ఈయన ఒకరు.

 

తాను టేకప్ చేసిన కేసుకు సంబంధించి కోర్టు లో వాదనలు వినిపించడానికి ఒక్క సెషన్ కు  దాదాపు రూ. 15 లక్షల వరకు తీసుకుంటారు.

 

ముఖేష్ అంబానీ, సల్మాన్ ఖాన్ లు కూడా ఈయన క్లైయింట్లే అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఖరీదోనని.

 

కుల్ భూషణ్ జాదవ్ కేసును వాదించడానికి భారత్ ప్రభుత్వం ఈయననే ఎంచుకుంది. అయితే హరీశ్ ఈ కేసు వాదించడానికి ఎంత తీసుకున్నారో తెలుసా...

 

కేవలం ఒక్క రూపాయి మాత్రమే...

 

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

 

ఖరీదైన బెంట్లీ కారును డ్రైవ్ చేయడం, పియానో వాయించడాన్ని ఇష్టపడే హరీష్ కు దేశభక్తి కూడా ఎక్కువే.

 

అందుకే ఒక్క రూపాయినే లాయర్ ఫీజుగా తీసుకొని పాక్ కు బుద్ధి చెప్పాడు. మనోడి ప్రాణాన్ని కాపాడాడు. అంతర్జాతీయంగా భారత్ తలెత్తుకునేలా చేశాడు.

 

హరీష్ ఇప్పుడే కాదు గతంలోనూ  భారత్ తరఫున అంతర్జాతీయన్యాయస్థానంలో పలు కేసులు వాదించి విజయం సాధించారు.

 

అందులో మార్షల్ దీవుల వివాదం ఒకటి. ఆయన వాదనలతో ఈ కేసు లో భారత్ గెలిచింది.

 

ఇప్పుడు కుల్ భూషణ్ కేసులోనూ మనమే గెలిచామంటే దాని వెనక హరీష్ ఉన్నాడనడంలో అతిశయోక్తి లేదు.