Asianet News TeluguAsianet News Telugu

‘‘షేర్ ఇట్’’ కి  పోటీగా ‘ఫైల్స్ గో’ అంటున్న గూగుల్

  • ఫైల్ షేరింగ్ యాప్ ని ప్రవేశపెడుతున్న గూగుల్
  • షేర్ ఇట్ కి పోటీగా ఫైల్ గో యాప్
Google launches Files Go App to give tough competition to SHAREit

‘షేర్ ఇట్’ దీని గురించి తెలియని వాళ్లు ప్రస్తుత రోజుల్లో ఎవరూ ఉండరనడంలో అతిశయోక్తి లేదు. ఒక మొబైల్ ఫోన్ నుంచి ఫోటోలు, వీడియోలు, మూవీస్ ఏదైనా సరే మరో మొబైల్ ఫోన్ లోకి పంపించాలంటే ఇప్పుడు అందరూ వాడేది‘ షేర్ ఇట్’. ఇది అందుబాటులోకి రాకముందు.. బ్లూటూత్ వాడేవారు. ఎప్పుడైతే ‘షేర్ ఇట్’ యాప్ అందుబాటులోకి వచ్చిందో.. అప్పటి నుంచి బ్లూటూత్ ఆల్ మోస్ట్ మరుగునపడిపోయింది. ఆ తర్వాత ఇలాంటివే చాలా యాప్ లు వచ్చినా.. షేర్ ఇట్ అంత గుర్తింపు సాధించలేదు.

Google launches Files Go App to give tough competition to SHAREit

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థ  తాజాగా ఫైల్ షేరింగ్ యాప్ ని ప్రవేశపెడుతోంది. షేర్ ఇట్ కి  పోటీ గా ‘ఫైల్స్ గో’ పేరుతో యాప్ ని విడుదల చేస్తోంది. దీని బీటా వర్షన్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమౌతోంది. మరికొద్ది రోజుల్లో దీని పూర్తి వర్షన్ ని విడుదల చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా ఫోటోలు, వీడియోలు, యాప్స్.. ఇలా అన్నింటినీ ఒకరి దగ్గర నుంచి మరొకరికి షేర్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ వర్షన్, అంతకన్నా డెవలప్డ్ వర్షన్స్ లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.ఈ యాప్.. షేర్ ఇట్ కన్నా.. 200 రెట్ల వేగంతో ఫైల్స్ ట్రాన్సఫర్ చేస్తుందని గూగుల్ చెబుతోంది.  మరి ఈ ఫైల్స్ గో.. షేర్ ఇట్ కి ఏ మాత్రం పోటీ ఇస్తుందో వేచి చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios