రిలయెన్స్ కు చెక్ పెట్టాలనుకున్న పోటీ టెలికాం సంస్థలకు టెలికాం ట్రిబ్యునల్ షాకిచ్చింది. జియో ఆఫర్ సరైందేనని స్పష్టం చేసింది

రిలయెన్స్ జియో వినియోగదారులకు మరో శుభవార్త. ఫ్రీ కాల్స్ తో వినియోగదారులను భారీగా పెంచుకుంటున్న జియో కు చెక్ పెట్టేందుకు పోటీ టెలికాం సంస్థలు వేసిన ఎత్తుగడలేవీ ఫలించలేదు.

టారిఫ్‌ వార్‌లో చివరకు జియో నే విజయం సాధించింది. రిలయెన్స్ జియో ఆఫర్లు నిబంధనల మేరకే ఉన్నాయని టెలికాం ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. జియో ఆఫర్ల పై క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జియో నుంచి వెలువడిన వెల్‌కం ఆఫర్‌, హ్యాపీ న్యూ ఇయర్‌​ ఆఫర్‌ రెండూ వేరువేరు అని తేల్చి చెప్పింది. ఆ ఆఫర్లలో ఎలాంటి తప్పులు లేవని పేర్కొంది. 

జియో ఆఫర్లపై పోటీ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ ... టెలికాం ట్రిబ్యునల్‌ (టీడీఎస్‌ఏటి) ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 


టెలికాం ట్రిబ్యునల్ తాజా ఆదేశంతో హ్యాపీ న్యూయర్ ఆఫర్ పై సస్పెన్స్ వీడినట్లే అయింది. ఈ ఏడాది మార్చి 31 జియో వినియోగదారులు ఈ ఆఫర్‌ ను వాడుకునేందుకు ఈ తీర్పుద్వారా మార్గం సుగమమైంది.