విదేశాల్లో ఉన్న భారతీయులకు మాత్రమే అవకాశం

అవునా.. నిజమా.. అని ఆశ్చర్యపోకండి. .. మీరు చదివింది నిజమే. కానీ, రద్దైన పెద్ద నోట్లను మార్చుకునే అవకాశం కేవలం ఎన్ఆర్ ఐ లకే కల్పించింది కేంద్రం. ఈ మేరకు తాజాగా దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది.

విదేశాలలో ఉన్నవారు సకాలంలో ఇండియాకు రాలేకపోవడం వల్ల పెద్దనోట్ల ను మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. దీని పై వందల సంఖ్యలో ఫిర్యాదు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

రద్దు ప్రకటన అమల్లోకి వచ్చిన 2016 నవంబరు 9 నుంచీ గడువుగా నిర్ధారించిన డిసెంబరు 30వ తేదీలోగా మార్చుకోలేకపోయిన వారు ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా వాటిని మార్చుకోవచ్చు.

ఎన్ఆర్ఐ లు అయితే 2017 జూన్‌ 30 వ తేదీ వరకూ మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది.

ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్‌కతా, నాగపూర్‌లలోని ఆర్ బి ఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ అవకాశం కల్పించారు.