వెండి ధర భారీగా పడిపోయింది.  కేజీ వెండి ధర రూ.40వేల దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ తగ్గడంతో శనివారం నాటి ట్రేడింగ్‌లో కేజీ వెండి ధర రూ.500 తగ్గి రూ.39,800కి చేరింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పది గ్రాముల పసిడి ధర రూ.31,250 వద్ద స్థిరంగా ఉందిఅంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ తగ్గడంతో పాటు వ్యాపార వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో వెండి ధర పడిపోయిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్‌ మార్కెట్లో వెండి ధర 3.63శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.58 డాలర్లుగా ఉంది. బంగారం ధర 1.22శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1,331.90డాలర్లుగా ఉంది.