పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర

Gold Prices Jump Rs 325 On Wedding Season Demand Global Cues
Highlights

  • పది గ్రాముల బంగారం ధర రూ.30,77
  • కేజీ వెండి ధర రూ.41,150

పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్ తో బంగారం డిమాండ్ బాగా పడింది. దీంతో ఒక్కసారిగా బంగారానికి రెక్కలు వచ్చినట్లయ్యింది. శనివారం పసిడి ధర రూ.325 పెరిగింది . దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,775కి చేరింది. బంగారు ఆభరణాల కొనుగోళ్లు ఊపందడం, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడటం, ఆభరణాల తయారీ దారుల నుంచి కూడా డిమాండ్ పెరగడంతో.. బంగారం ధర పెరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.600 పెరిగి రూ.41,150కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో వెండి ధర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.30,775గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.30,625గా ఉంది.అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర  0.04శాతం పెరిగి 1,755 డాలర్లు  పలికింది. ఔన్సు వెండి ధర 1.32శాతం పెరిగి 17.28 డాలర్లకు చేరుకుంది.

loader