భారీగా పెరిగిన బంగారం ధర

కొనేద్దాం అనుకునే టైం లో కొన్ని ధరలు అలా అందనంత పెరిగిపోతుంటాయి. ఇప్పుడు బంగారం ధర కూడా అలానే పెరిగింది.

మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.330 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.29,030 గా ఉంది.

నోట్ల రద్దు తర్వాత బంగారం ధర భారీగా పతనమైన విషయం తెలిసిందే.

ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడం వల్లే ధర పెరిగినట్లు బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, వెండి ధర రూ.350 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.40,750 కు చేరింది.