శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర

Gold Price Falls Below Rs31000 and silver falls bellow rs39000
Highlights
  • పది గ్రాముల బంగారం ధర రూ.30,950
  • కేజీ వెండి ధర రూ.38,900

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. పసిడి ధర గురువారం భారీగా తగ్గింది. నేటి బులియన్ మార్కెట్ లో రూ.600 తగ్గి.. పది గ్రాముల బంగారం ధర రూ.30,950కి చేరింది. రెండు రోజుల క్రితం 14నెలల గరిష్టానికి పెరిగిన పసిడి ధర.. ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ప్రస్తుతం పసిడి ధర రూ. మూడు వారాల కనిష్ట స్థాయికి చేరుకుంది. వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. వెండి ధర కూడా నేటి బులియన్ మార్కెట్లో భారీగా పడిపోయింది. రూ.450 తగ్గి కేజీ వెండి ధర రూ. 38,900వేలకు చేరుకుంది. మొన్నటి దాకా.. 40వేల మార్క్ లో ఉన్న సిల్వర్ ధర... ఇప్పుడు 39వేల దిగువకు పడిపోయింది.

 అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 0.61శాతం తగ్గి ఔన్సు బంగారం ధర 1,310.10 డాలర్లుగా ఉంది. 0.37శాతం తగ్గి ఔన్సు వెండి ధర 16.28 డాలర్లకు చేరుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బంగారం ధర, వెండి నాణేల తయారీ దారుల కొనుగోళ్లు మందగించడంతో సిల్వర్ ధర తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

loader