వారం రోజుల కనిష్టానికి పసిడి ధర

గతకొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధర ఈ రోజు భారీగా తగ్గింది.

ప్రసుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం నిన్నటి తో పోల్చుకంటే రూ. 265 తగ్గింది. ఈ రోజు ట్రేడింగ్ లో బంగారం ధర రూ.28,400 గా నమోదైంది.

అంతర్జాతీయ పరిణామాలు, జువెయెలరీ షాపుల యజమానుల నుంచి డిమాండ్ తగ్గడంతో ధర పతనమైనట్లు ట్రేడింగ్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

బంగారం ధరలోనే వెండి ధర కూడా ఈ రోజు తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధర రూ.205 తగ్గింది. ప్రసుత్తం కిలో వెండి ధర రూ.38,200 గా ఉంది.

పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం వల్లే వెండి ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.