అమెరికా ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన కీలకమయిన సమాచారం తొందర్లో విడుదల చేయబోతున్నదనే వార్త రావడంతో అంతర్జాతీయంగా బంగారు కొనుగోళ్లు మందగించాయి. దేశీయంగా కూడా అభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పడిపోయింది. ఢిల్లీలో పదిగ్రాముల 99.9 శాతం ప్యూరిటీ, 99.5 శాతం ప్యూరిటీ బంగారు ధరలు రు.250 పడిపోయి రు 29,100, రు28,950 లకు చేరుకున్నాయి.
గత కొన్ని రోజులుగా పైపైకి ఎగిసిన పసిడి ధర బుధవారంనాడు కిందకు దిగివచ్చింది.
స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 29,100 పలికింది.
బంగారం బాటలోనే వెండి వెల కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ. 450 తగ్గి రూ. 40,000కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ల్ బలహీనంగా ఉండటం స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతోనే పసిడి, వెండి ధరలు తగ్గాయి.
అమెరికా ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి కీలకమయినసమాచారం తొందర్లో విడుదల చేయబోతున్నదనే సమాచారం రావడడంతో అంతర్జాతీయంగా బంగారు కొనుగోళ్లు మందగించాయి. దేశీయంగా కూడా అభరణాల తయారీదారులనుంచి డిమాండ్ పడిపోయింది.
ఢిల్లీలోపదిగ్రాముల 99.9 శాతం,99.5 శాతం ప్యూరిటీ బంగారు ధరలు రు.250 పడిపోయి రు 29,100, రు28,950 లకు చేరుకున్నాయి.
