సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గోధార్ కార్డు

దేశం డిజిటల్ కావాలి... లావాదేవీలు క్యాష్ లెస్ అవ్వాలి.. ప్రజలు స్మార్ట్ గా మారాలి... మోదీ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాటలు ఇవి..

అధార్ కార్డుల అనుసంధానం నుంచి రూపే కార్డుల పంపిణీ వరకు అంతా దేశాన్ని డిజిటల్ మయం చేసే కార్యక్రమాలే. వీటి కోసం కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

అయితే దేశ జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెడితే...

కేంద్ర ఇటీవల గోవులకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలని యోచిస్తుందట. నెట్ లో ఈ విషయం వైరల్ గా మారింది. ఆన్ లైన్ లో ఇప్పుడు ఇవే ముచ్చట్లు తెగ తెరుగుతున్నాయి.

మానవాభివృద్ధిలోనే కాదు సృజనాత్మకతలోనూ మన కంటే కాస్త ముందే ఉండే కేరళీయులు ... కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ ఆలోచనలను అప్పుడే ఆచరణలో పెట్టారు.

గోవును ఫొటో తీసి ఆధార్ కార్డు సృష్టించారు. దానికి ముద్దుగా అమ్మిని ( అమ్ములు) అనే పేరు కూడా పెట్టారు.

మనకిచ్చే కార్డులను ఆధార్ అంటున్నారు. మరి గోవులకిచ్చే కార్డులను ఏమనాలి అనే డౌట్ మీకు రావొచ్చు. అందుకే వాటికి కేరళవాసులు గోధార్ అనే నామకరణం చేశారు.

సోసల్ మీడియోలో ఈ గోధార్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.