గోదావరి నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య

four of a family commit suicide
Highlights

తల్లిదండ్రులతో పాటు ఇద్దరు చిన్నారులు

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద ఓ కుటుంబం మొత్తం గోదావరి నదితో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లలతో సహా నదిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

వీరు నదిలో దూకడాన్ని గమనించిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చేపట్టారు. అయితే ప్రస్తుతానికి ఇద్దరు చిన్నారుల మృత దేహాలు లభ్యమయ్యాయి. దంపతుల మృదేహాల కోసం పోలీసులు ఇంకా గాలింపు చేపడుతున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం రాజమహేంద్రవరానికి చెందిందిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక కారణాలతోనే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్్పడి ఉంటుందని సమాచారం. ఆ ఆత్మహత్యలకు సంబంధించి మరింత  సమాచారం తెలియాల్సి ఉంది.

 

loader