Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో సంస్కృత ప్రతిభాన్వేషణ పోటీలు ప్రారంభం

తిరుపతిలో నాలుగు రోజుల సంస్కృత ప్రతిభాన్వేషణ పోటీలు 

four day sanskrit talent search competitions begin in Tirupati

ప్రతిసంవత్సరం జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ కోసం విద్య, సంస్కృతిసంబద్ధమైన క్రీడాదిస్పర్దలు తిరుపతి రాష్ట్రీయ సంస్కృతవిద్యాపీఠంలో మొదలయ్యాయి. నిన్నటి నుంచి పోటీలు నాలుగు రోజుల పాటు అంటే ఫిబ్రవరి రెండో తేదీ దాకా జరగుతాయి. ఈ పోటీలు  2007 వ సంవత్సరం నుండి ప్రతియేటా   నిర్వహింపబడుతున్నాయి.  


 ఈ ప్రాతిభస్పర్ధల  ఉద్దేశాలు:   

 

1) సంస్కృతవిద్యార్థులలో విద్యాసంబద్ధమైన సంస్కృతిసంబద్ధమైన నైపుణ్యాలను వెలికితీయడం, అందుకు తగిన అవకాశాలు కల్పించడం.   

2) దేశవ్యాప్తంగా ఉన్న విభిన్నసంస్కృత సంస్థలలో అధ్యయనం చేస్తున్న విద్యార్థుల నడుమ సౌహార్దభావాన్ని పెంపొందించడం.

3) సంస్కృతవిద్యార్థులలో పోటీ తత్త్వాన్ని పెంచడం.

4) సంస్కృత సంస్థలు, సంస్కృతవిద్యార్థులు తమ తమ ప్రతిభాపాటవాలను స్వయంగా మూల్యాంకనం చేసుకునే అవకాశం కల్పించి, వెనుకబడిన చోట్ల మెరుగుపరుచుకునేందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం.

5) సంస్కృతవిద్యార్థులలో వక్తృత్వనైపుణ్యాన్ని వాదవివాదపటిమను పెంచడం.    

6) విద్యార్థులలో సంతులితవ్యక్తిత్వాన్ని వికసింపజేసి,  మాతృదేశం పట్ల వారిలో బాధ్యతాభావాన్ని పెంచడం.  

 

స్పర్ధలు (పోటీలు) ఈ క్రింది అంశాలలో నిర్వహింపబడతాయి:

 

1) విద్యాసంబద్ధమైన స్పర్ధలు: 

 

భాషణస్పర్ధలు ఈ శాస్త్రాలలో ఉంటాయి:  

 

1.1 వేదం 

1.2 సాహిత్యం 

1.3 వ్యాకరణం 

1.4 న్యాయవైశేషికాలు 

1.5 సాంఖ్యయోగాలు 

1.6 పూర్వమీమాంస 

1.7 వేదాంతం 

1.8 ధర్మశాస్త్రం 

1.9 జ్యోతిషం 

1.10 పురాణేతిహాసాలు 

 

2) శ్లోక-అంత్యాక్షరి

3) ఆశుకవిత

4) సమస్యాపూరణం

5) రసప్రశ్నలు (క్విజ్)

ఇవికాక, సంస్కృతిసంబద్ధమైన ఈ క్రింది పోటీలు కూడా ఉంటాయి:

6) సంస్కృతగీతగానం

7) ఏకపాత్రాభినయం 

8) ఏకాంకికాభినయం 

9) భారతీయలోకనృత్యం (జానపదనృత్యం)

ఈ సంవత్సరం (2017 లో)  ఈ క్రింది విద్యాసంస్థలు పాల్గొంటున్నాయి:

1) శ్రీచంద్రశేఖరేంద్రసరస్వతీమహావిద్యాలయం - కాంచీపురం     

2) రాష్ట్రియసంస్కృతసంస్థానం - శృంగేరి 

 3) శ్రీ అహోబిలమఠ ఆదర్శ సంస్కృత మహావిద్యాలయం - తమిళనాడు   

 4) శ్రీమన్మధ్వసిద్ధాంతప్రబోధకసంస్కృతస్నాతక-స్నాతకోత్తరఅధ్యయన కేంద్రం - ఉడుపి 

5) ఆర్. యస్. ముండ్లే ధర్మపీఠం - కళా - వాణిజ్య మహావిద్యాలయం - నాగపురం

6) కవికులగురుకాళిదాస సంస్కృతవిశ్వవిద్యాలయం - నాగపురం 

7) పూర్ణప్రజ్ఞ విద్యాపీఠ సంస్కృత స్నాతక - స్నాతకోత్తర అధ్యయన కేంద్రం - బెంగళూరు 

8) రాష్ట్రియసంస్కృతసంస్థానం - పురీ

9) సర్వకారసంస్కృత మహావిద్యాలయం - త్రిపుణితురా (కేరళ)

10) బ్రహ్మశ్రీ సంస్కృత మహావిద్యాలయం - గుజరాత్ 

11) సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం - పూణే 

12) కాలియాచౌక్ విక్రమ కిశోర ఆదర్శ సంస్కృత మహావిద్యాలయం - కోల్కతా 

13)  రాష్ట్రియసంస్కృతసంస్థానం - లక్నో

14) శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం - తిరుపతి                    

15) రాష్ట్రియసంస్కృతసంస్థానం - గురువాయూర్ 

16) రాష్ట్రియసంస్కృతసంస్థానం -  ముంబై 

17) రాష్ట్రియసంస్కృతసంస్థానం -  భోపాల్ 

18) శ్రీ సూర్యాపురసంస్కృతమహావిద్యాలయం - సూరత్    

19) శ్రీలాల్ బహదూర్ శాస్త్రి  రాష్ట్రియసంస్కృతవిద్యాపీఠం - న్యూ ఢిల్లీ 

20) రాష్ట్రియసంస్కృతసంస్థానం - అగర్తలా (త్రిపుర) 

21) రామకృష్ణ మిషన్ - వివేకానంద విశ్వవిద్యాలయం - పశ్చిమ బెంగాల్ 

22) రాష్ట్రియసంస్కృతవిద్యాపీఠం  - తిరుపతి  

 

తిరుపతిలోని రాష్ట్రియసంస్కృతవిద్యాపీఠం పారంపరిక సముత్కర్షకేంద్రంగా విరాజిల్లుతూ భారతీయ శాస్త్రాల సంరక్షణకు, సంవర్ధనకు సతతప్రయత్నం చేస్తూ ఉన్నది.   విద్యాబోధనకు లక్ష్యం కేవలం విద్యార్థులలో జ్ఞానాన్ని పెంపొందించడమే కాక, వారిలో అంతర్నిహితమైన ప్రతిభను వెలికితీసి సర్వాంగీణమైన వికాసాన్ని వారిలో కలగజేయడం కూడా అన్నది విద్యాపీఠం నమ్మిక.   

Follow Us:
Download App:
  • android
  • ios