ఫోర్ట్ వాల్టన్ బీచ్ ను కుదిపేసిన టోర్నడో (వీడియో)

Fort Walton Beach of the tornado.
Highlights

ఫోర్ట్ వాల్టన్ బీచ్ ను కుదిపేసిన టోర్నడో (వీడియో)

ఫోర్ట్ వాల్టన్ బీచ్ ను టోర్నడో కుదిపేసింది. ఒకలూసా దీవిలోని డేవ్ పెర్కిన్స్ లోని ఫోర్ట్ వాల్టన్ బీచ్ ను ఆదివారంనాడు టోర్నడో తాకింది. దాంతో వ్యాపార సంస్థలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంటి కప్పు ఎగిరిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వరల్ అవుతోంది.ఆదివారం సాయంత్రం 3 గంటలకు తొలి టోర్నడో వాచ్ జారీ చేశారు. అయితే, టోర్నడోనా అవునా, కాదా అనే దాన్ని ఇప్పుడే నిర్ణయించలేమని అధికారవర్గాలు అంటున్నాయి. తమకు ఫన్నెల్ క్లౌడ్స్ కు సంబంధించిన పలు వీడియోలు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని చెప్పాయి. వేగంగా వీచిన గాలులకు ఇళ్లు, చర్చిలు, వాణిజ్య సంస్థలు అతలాకుతలమయ్యాయి. దక్షిణ ఒకలూసా కౌంటీలో ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

 

 

 

 

loader