కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్నాయకులు విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన జగన్నాయకులు
శ్రీకాకుళం జిల్లా పలాస మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు శనివారం కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా... చికిత్స పొందుతూ శనివాంర మృతి చెందారు.
జగన్నాయకులు అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామమైన మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కాగా.. ఆయన 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు.
