ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్ సైట్  ఫ్లిప్‌కార్ట్‌ తన బిలియన్‌ బ్రాండ్‌ను విస్తరిస్తోంది. బిలియన్ బ్రాండ్ కింద ఇటీవల ఫ్లిప్ కార్ట్ క్యాప్చర్‌+ పేరిట స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా ఈ బ్రాండు కింద కొత్తగా రెండు పవర్‌ బ్యాంక్‌లను లాంచ్‌ చేసింది.  ఒకటి 10000ఎంఏహెచ్‌ వెర్షన్‌ దీని ధర 799 రూపాయలు. రెండోది 15000ఎంఏహెచ్‌ కెపాసిటీ కలిగిన మోడల్‌. దీని ధర 999 రూపాయలుగా ప్రకటించింది. ''ఏ+ గ్రేడ్‌'' ''లిథియం-అయాన్‌'' బ్యాటరీస్‌తో వీటిని తయారు చేశారు.

ఈ రెండు పవర్‌ బ్యాంక్‌లు ఎక్స్‌ క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ లో బ్లాక్‌, కాపర్‌, రోజ్‌ గోల్డ్‌ కలర్స్ లో లభ్యం కానున్నాయి.  ఈ పవర్‌ బ్యాంక్‌లకు ఎల్‌ఈడీ టార్చ్‌ కూడా ఉంది. ఏడు రకాల భద్రతాపరమైన ఫీచర్లతో బిలియన్‌ పవర్‌ బ్యాంక్‌లను తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్‌ చెప్పింది. వాటిలో అండర్‌-ఓల్టేజీ, ఓవర్‌ ఓల్టేజీ ప్రొటెక్షన్‌, బిల్ట్‌-ఇన్‌ ప్రొటెక్షన్‌, షార్ట్‌-సర్క్యూట్‌ ప్రొటెక్షన్‌ ఉన్నాయి. టాప్‌-సెల్లింగ్‌ పవర్‌ బ్యాంక్‌ల కంటే 13 శాతం తేలికగా ఉన్నట్టు కూడా కంపెనీ తెలిపింది.