ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్ సైట్  ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు ప్రకటించింది. శాంసంగ్‌ కార్నివల్‌(ఉత్సవం) పేరుతో ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్లు, టాబ్లెట్లు, హెడ్‌ఫోన్లు, మొబైల్‌ యాక్ససరీస్‌, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్స్‌, మైక్రోవేవ్స్‌, ఎయిర్‌ కండీషనర్లు, వాషింగ్‌ మిషన్లు వంటి వాటిపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రూ.46వేల ధర కలిగిన శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 స్మార్ట్‌ ఫోన్‌ రూ.22,990కు అందుబాటులోకి వచ్చింది. గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ.41,900కాగా.. డిస్కౌంట్ లో రూ.35,900కే అందిస్తోంది. మిడ్‌-రేంజ్‌ గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 64జీబీ ఫోన్‌ ధర రూ.17,900 నుంచి రూ.11,900కి దిగొచ్చింది. గెలాక్సీ ఆన్‌ నెక్ట్స్‌ 16జీబీ స్మార్ట్‌ ఫోన్‌ రూ.10,999 నుంచి రూ.9,999కు తగ్గింది. గెలాక్సీ ఆన్‌ మ్యాక్స్‌ 32జీబీ స్మార్ట్‌ఫోన్‌ రూ.13,900కే అందుబాటులో ఉంది. 

అంతేకాక ఈ ఫెస్టివల్‌లో భాగంగా టాబ్లెట్‌ రేంజ్‌ రూ.8,999 నుంచే ప్రారంభమైంది. శాంసంగ్‌ గేర్‌ ఫిట్‌2 ప్రొ రూ.13,590కే లభ్యమవుతోంది. ప్రీఆర్డర్లకు 5 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. శాంసంగ్‌ హెడ్‌ఫోన్లు, స్పీకర్లపై 25 శాతం వరకు డిస్కౌంట్లు, మెమరీ కార్డులు, హార్డ్‌ డ్రైవ్‌లు, మొబైల్‌ ఛార్జర్లు వంటి వాటిపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది.