అమ్మాయిలు హానికరం కాదు... పక్కలోకి పనికొస్తారు..

 

50 ఏళ్లుగా సినిమాలో నటిస్తూ సీనియర్ నటుడిగా వెలగబెడుతున్న చలపతిరావు నిన్న ఓ సినిమా ఆడియో ఫంక్షన్ లో అన్న మాటలివి.

 

సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యాలపై పెద్దస్థాయిలో దుమారం చెలరేగుతున్న ఆయన మాత్రం లైట్ గానే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆయనపై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.

 

ఈ ఘటన మరవకముందే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా తనదైన శైలీలో బూతుపురాణం విప్పి తన స్థాయి ఏంటో నిరూపించుకున్నారు.

 

నిన్న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో గొర్రెల పెంపకంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన తలసాని  ప్రతిపక్షాలపై బూతులందుకున్నారు.

 

తన ప్రసంగమంతా కొడుకులు,  దగుల్బాజీల పదాన్ని వాడకుండా ఉండలేదు. రాయడానికి కూడా వినలేనంత దారుణంగా మాట్లాడారంటే బాగుంటుందేమో..

 

ఆ పీసీసీ ప్రసిడెంట్ ... ఆ గడ్డపోడు...అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై... ఆ పొట్టోడు తుపాకీ రాముడు.. పిసికితే పాణంపోతది... వాడివి పెద్దపెద్ద మాటలు అంటూ రేవంత్ పై మండిపడ్డారు.

సినిమా, రాజకీయం ఈ రెండు రంగాల్లో ఉన్నవారు సెలబ్రెటీల కిందకే వస్తారు. వారు ప్రతిఅడుగును ప్రజలు గమనిస్తుంటారు. జనాల్లో కాస్తోకూస్తో ఇమేజ్ ఉండే ఇలాంటి వ్యక్తులు నోరు విప్పుతున్నప్పడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. నోటిదూలతో మాట్లాడితే మీడియా పట్టించుకోదేమో కానీ సోషల్ మీడియా మాత్రం ఉతికిఆరేస్తుంది.