నిశ్చితార్థ వేడుకలో గొడవ...ఒకరి మృతి

fighting between 2 groups in engagement ceremony
Highlights

పాతబస్తీలో దారుణం

పాతబస్తీలోని హుస్సెనీఆలం కు చెందిన షేక్ ఇమామ్ తన కూతురి నిశ్చితార్థ వేడుకలను ఓ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశాడు.ఈ వేడుకకు తన బందువులతో పాటు సన్నిహితులను, కాలనీవాసులను కూడా ఆహ్వానించాడు. అయితే  ఈ వేడుకలకు అశ్వాక్ అనే  వ్యక్తి మద్యం మత్తులో వచ్చి క్యాటరింగ్ బాయ్స్ తో గొడవ పెట్టుకున్నాడు. తనకు బోజనం వడ్డించడం లేదంటూ ఆగ్రహానికి లోనయ్యాడు. అంతటితో ఆగకుండా పెళ్లివారిని కూడా దూషిస్తూ పంక్షన్ హాల్ నుండి బయటకు వెళ్లాడు. 

తర్వాత అశ్వాక్ ఓ 20 మంది రౌడీలను వెంటపెట్టుకుని మళ్లీ పంక్షన్ హాల్ లోకి ప్రవేశించాడు. విందు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి భోజనం గిన్నెలు, వంటపాత్రలు చెల్లాచెదురుగా పడేసి వీరంగం సృష్టించారు. అయితే వీరిని అడ్డుకోడానికి ప్రయత్నించిన మహ్మద్ అన్వర్, సోహెల్ లపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అన్వర్ అక్కడికక్కడే చనిపోగా, సోహెల్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
   
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చూపట్టారు.

 
 

loader