కడప ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియెజకవర్గం శాసనసభ్యుడు ముస్తాఫా ఆరోపించారు. 


ఫాతిమా కళాశాలలో చదివే వైద్య విద్యార్థుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేవలం కడప లో ఈ కళాశాల ఉండటం వల్ల  విద్యార్థులు పాపం చేసుకున్నారా అనుకోవాలా అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుకోవద్దని ఆయన హితవు పలికారు.
ఈ విషయం పై మా నేత జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వడ్డా కు లేఖ రాశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అవసరమైతే విద్యార్థులను మా పార్లమెంటు సభ్యులు ఢిల్లీ కి తీసుకెళ్ళటామని కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు..
 విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని  న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది
మైనార్టీ విద్యార్థులు బాగా ఉన్నత స్థానంలోకి వెల్లలన్న కృత నిశ్చయం ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మైనారిటీలు దగ్గరగా ఉన్నారన్న అక్కసుతో నే విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నా అనుమానాలు. వ్యక్తమవుతున్నాయి. 
మా నేత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రేసర్వషన్లు ఇవ్వడం వల్ల అనేకమంది విద్యార్థులు ఇంజనీర్లు ..డాక్టర్లుగా ఎడిగారని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం..