ఆత్మహత్యాయత్నం చేసిన కూతురుని హత్యచేసిన తండ్రి

Father kills daughter at anantapur district
Highlights

అనంతరపురం జిల్లాలో దారుణం

అనంతపురం రామగిరి జిల్లాలో దారుణం జరిగింది. కన్న కూతురు ఆత్మహత్యాయత్నం చేసిన కన్న కూతురిని ఓ తండ్రి హత్య చేశాడు. ఈ విషాద సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

జిల్లాలోని రామగిరి మండల కేంద్రానికి చెందిన కామన్న, అనితల కుమార్తె భావనకు ఈనెల 1న  సురేష్ అనే యువకుడితో పెళ్లయింది.  అయితే గ్రామంలో జాతర ఉండటంతో తల్లిదండ్రులు భావనను ఇంటికి తీసుకువచ్చారు. అయితే జాతర అయిపోయాక ఆమెను అత్తవారింటికి పంపించాలని తల్లిదండ్రులు భావించారు.అయితే అందుకు భావన ఒప్పుకోలేదు. తాను అత్తవారింటికి వెళ్లనని ఇక్కడే ఉంటానని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే అలా ఎలా కుదురుతుంది, నువ్వు వెళ్లి తీరాల్సిందేనని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన భావన ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న కూతురిని గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అక్కడికి తీసుకెళ్ల కుండా తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర నొప్పితో బాధపడుతూ అరుస్తున్న కూతురిని తండ్రి కామన్న చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు కూతురిని చంపిన తండ్రి కామన్న ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 
 

loader