తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత

తొలితరం సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత

 ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు(98) అనారోగ్యంతో   ఇవాళ తెల్లవారుజామున 5.30గంటలకు కన్నుమూశారు. సుప్రసిద్ద వాగ్గేయకారుడిగానే కాకుండా విజయవాడలోని ఆకాశవాణి సంచాలకునిగా కూడా ఈయన పని చేశారు. సంచాలకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించిన రజనీకాంతరావు, రేడియో శ్రోతలను అలరించడమే కాకుండా స్వరకర్తగా, గీతరచయితగా కూడా ఆయన తన సేవలను అందించారు. ఇలా తొలితరం సంగీత దర్శకుల్లో ఒకరైన ఈయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు.

 బాలాంత్రపు రజనీకాంతరావు 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఈయన తొలి స్వాంత్ర్య దినోత్సవం 1947 ఆగస్ట్ 15వ తేదీన స్యయంగా రచించి స్వరపర్చిన  ''జయభేరి, వాయించు నగారా గీతం'' మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. అలాగే ఆ కాలంలోనే  ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించడమే కాకుండా స్వరాలు అందించారు.  ఈ పాటను మాతెలుగు తల్లి పాటను పాడిన టంగుటూరి కుమారి చేత పాడించి తెలుగు ప్రజల్లో స్వాత్ంత్య్ర కాంక్షను పెంచిన మహోన్నత వ్యక్తి బాలాంత్రపు.  

బాలాంత్రపు రజనీకాంతరావు మృతి పట్ల ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో బాలాంత్రపు రజనీకాంత రావు పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos