దాకర్ పట్టణంలో రూ. 2 వేల నోటు అంటేనే హడలిపోతున్నారు. అసలు నోటు ఇచ్చినా ఎవరూ తీసుకోవడం లేదు.
పెద్ద నోట్లు రద్దయ్యాయి. కొత్త నోట్లు జనాల చేతికి ఇంకా అందడం లేదు. ఈ విపత్కర పరిస్థితిలో భారతీయుల కష్టాలను గ్రహించి ఓ తుంటరి గ్యాంగ్ రూ. 2 వేల నోట్లను అచ్చంగా ఆర్ బి ఐ లాగా అచ్చొతే ప్రింటర్ ను తయారు చేసింది.
మీకు ఆ ప్రింటర్ కావాలంటే గుజరాత్ లోని ఖేదా జిల్లాలోని దాకర్ పట్టణానికి వెళ్లాల్సిందే. అక్కడ మీకు వైట్ పేపర్లు దొరికినంతగా ఈజీగా రూ. 2 వేల నోటు దొరుకుతుంది.
దీంతో దాకర్ పట్టణంలో రూ. 2 వేల నోటు అంటేనే హడలిపోతున్నారు. అసలు నోటు ఇచ్చినా ఎవరూ తీసుకోవడం లేదు. దీంతో పోలీసులు దీనిపై కాస్త సీరియస్ గానే దృష్టిపెట్టారు.
టౌన్ లోని రాణియా క్రాస్‌కు దగ్గరల్లోని ఓ దుకాణంలో నోట్లను ప్రింట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకొని దీనికి సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రింటింగ్ మెషీన్‌తో పాటు రూ. 12.45 లక్షల విలువ చేసే నకిలీ రూ. 2 వేల నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పెద్ద నోట్ల రద్దు తర్వాత కమిషన్ తీసుకుంటూ ఇలా నకిలీ నోట్లను ప్రింట్ చేస్తోంది ఈ గ్యాంగ్.
