Asianet News TeluguAsianet News Telugu

తుస్సు మన్న సోషల్ మీడియా ’సీరియల్ బ్లాస్టులు‘

 సీరియల్ బాంబు బ్లాస్టుల బోగస్ అలర్ట్ సోషల్  మీడియాలో తెగ పేలింది

fake bomb scare goes viral in Hyderabad

సోషల్ మీడియా... బాగానే ఉంది. కాని అది ఎంతపెద్ద వాణ్నయినా ఈజీగా బుట్టలో వేసుకుంటుంది. ఏవిషయాన్నయినా నమ్మిస్తుంది. పనికిమాలినపనులు చేయిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చేదంతా గ్యారంటీ సరుకు కాదు. 

అయితే, ఏమో , ఎవరు చూశారు, నిజమోనేమో అనే అనుమానం పుట్టించడంతో   సోషల్ మీడియా విజయవంతమయింది.

 

  హైదరాబాద్ లో పద్నాలుగుచోట్ల బాంబులు పెట్టారని ఠారెత్తించే మెసేజొకొటి  తెగ షేరయింది సోషల్ మీడియా చానెల్స్ లో.  వాట్సాఫ్ లో ఉధృతంగా పరవళ్లు తొక్కిన మెసేజ్ అది. చిత్రమేంటంటే, ప్రతిఒక్కరు ఆమెసేజ్ తనకే తెలిసిందన్నట్లు  షేర్ చేశారు. ఎవరూ కూడ ఫార్వర్డ చేస్తున్నట్లు చెప్పలేదు. కొంతమంది ప్రభుత్వాధికారులు కూడా ఈ మెసేజ్ తమకు తెలిసిన జర్నలిస్టులకు పంపించి, అందరికి అందేలా చూడమని కూడా సలహా ఇచ్చారు. ఇదే వైరల్ అయిపోయింది. చివరకు ఈ ఇదంతా బోగస్ అని తేలింది.

 శనివారం నాడు నగరంలో 14 ప్రాంతాలలో సీరియల్ బాంబు బ్లాస్టులంటాయని  టెర్రరిస్టులనుంచి సమాచారం అందిందనేది ఈ మెసేజ్. ఇంతవరకు ఎలాంటి అలజడి లేదు. నగరం ప్రశాంతం.

 

ఇదీ మెసేజ్ :

Hyderabad is on high alert

Terrorist reveled that they were planned 14 bomb blasting on this Saturday at many places so please be carefull revealed places are dilsukh nagar sai baba temple, kukkatpally shopping complex, mehdipatnam , old city, charminar, lakdi ka pul, dhoolpet, kachiguda, secunderbad station,mgbs station, hitech city, so please be aware hyderabad is on high alert please share it to all other groups whom you care for share all.

 

హైదరాబాద్ , రాచకొండ పోలీస్ కమిషనర్ , హైదరాబాద్ పోలీసు కమిషనర్లు ఇదంతా బోగస్ అని చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి రూమర్లను విశ్వసించి బెంబేలెత్తిపోవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రూమర్లు సూపర్ ఫాస్టుగా  సరిహద్దులు దాటుతాయని వారు హెచ్చరించారు.

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios