Asianet News TeluguAsianet News Telugu

రూ. 2 వేల నోటు 6 నెలల ముందే...

రఘురామ్‌ రాజన్ గవర్నర్‌ గా ఉన్నప్పుడే రూ. 2000 నోటు చలామణికి ఆమోదం లభించింది.

fact about rs 2000 note

 

పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడకూడదని రూ. 2 వేల నోటును కేంద్రం విడుదల చేసిందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.

 

ఎందుకంటే నోట్ల రద్దు కంటే ముందే రూ. 2 వేల నోటును తీసుకరావడానికి  ఆర్బీఐ సిద్ధమైందట. కాకపోతే అప్పుడు పెద్ద నోట్ల రద్దు విషయం ప్రస్తావనకు రాలేదు.

 

 ‘ఇండియన్‌ ఎక్స్ ప్రెస్’  సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఆర్బీఐ ఈ సమాధానం ఇచ్చింది.
 

 

వాస్తవంగా గత ఏడాది మే నెలలోనే రూ. 2 వేల నోటును చలామణిలోకి తీసుకరావడానికి ఆర్బీఐ ఏర్పాట్లు చేసింది. అయితే ఆ తర్వాత కేంద్రం దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.

 

నవంబర్ లో పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం వెంటనే ఆర్బీఐ ప్రతిపాదించిన రూ. 2 వేల నోటుకు వెంటనే ఆమోదం తెలిపింది. అందుకే మే లో విడుదల కావాల్సిన రూ. 2 వేల నోటు నవంబర్ లో ప్రజల చెంతకు చేరింది.



అంటే రఘురామ్‌ రాజన్ గవర్నర్‌ గా ఉన్నప్పుడే రూ. 2000 నోటు చలామణికి ఆమోదం లభించిందని దీన్ని బట్టి తెలుస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios