గుప్పెడు నట్స్ తో గుండె పదిలం

eating nuts of all kinds can lower risk for cardiovascular
Highlights

  • మ‌నం తినేవి వాల్‌న‌ట్స్‌, బాదంప‌ప్పు, పిస్తా, వేరుశెన‌గ‌లు, జీడిప‌ప్పు.
  • వీటిల్లో ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయ‌ని అంద‌రికీ తెలుసు.
  • వీటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. అంతేకాదు..
  • గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కూడా పొందవచ్చు.

మ‌న‌కు మార్కెట్‌లో ఎన్నో ర‌కాల న‌ట్స్ తినేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్ర‌ధానంగా మ‌నం తినేవి వాల్‌న‌ట్స్‌, బాదంప‌ప్పు, పిస్తా, వేరుశెన‌గ‌లు, జీడిప‌ప్పు. వీటిల్లో ఎన్నో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయ‌ని అంద‌రికీ తెలుసు. వీటి వ‌ల్ల మ‌న శ‌రీరానికి సంపూర్ణ పౌష్టికాహారం అందుతుంది. అంతేకాదు.. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కూడా పొందవచ్చు. దీనిపై పలువురు పరిశోధనలు కూడా చేశారు. వారి పరిశోధనల ప్రకారం..  నట్స్ వారానికి ఒక ఔన్సు తీసుకోవడం వల్ల గుండెజబ్బు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వారానికి ఔన్సు కన్నా తక్కువ నట్స్ తీసుకునే వాళ్లకి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం 9శాతం పెరుగుతుందట. అయితే ఈ న‌ట్స్‌ను రోజూ ఎంత ప‌రిమాణంలో తింటే మ‌న‌కు లాభం క‌లుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

వాల్ నట్స్...

10 గ్రాముల మార్క్‌ను చేరాలంటే వాల్‌న‌ట్స్‌ను క‌నీసం రోజుకు 5 నుంచి 6 వ‌ర‌కు తినాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రావు. అదేవిధంగా ఎముక‌లు దృఢత్వాన్ని పొందుతాయి. శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. డ‌యాబెటిస్ ఉంటే అదుపులోకి వ‌స్తుంది. గ్లూకోజ్ నియంత్ర‌ణలో ఉంటుంది. క్యాన్స‌ర్లు రావు. మ‌గ‌వారిలో అయితే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది. ఆడ‌వారిలో రుతు స‌మ‌స్య‌లు పోతాయి.

బాదం పప్పు...
వీటిని నిత్యం 8, 9 తింటే చాలు. 10 గ్రాముల మోతాదుకు చేరుకుంటాం. వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్షన్లు న‌య‌మ‌వుతాయి. పురుషుల్లో ఉండే వ్యంధ్య‌త్వ స‌మ‌స్య‌లు పోతాయి. సంతానం క‌లిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. డ‌యాబెటిక్స్‌కు ఇది మంచిది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ ఉత్ప‌న్నం అవుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఆహారం. త‌క్కువ మొత్తంలో తిన్నా క‌డుపు ఫుల్‌గా ఉంటుంది.

వేరుశెనగ( పల్లీలు)
వీటిని మనం నిత్యం ప‌లు వంట‌కాల్లోనూ, చ‌ట్నీల్లోనూ వాడుతుంటాం. అయితే వేరుశెన‌గ‌ల‌ను న‌ట్స్ రూపంలోనూ రోజూ తీసుకోవచ్చు. 10 గ్రాముల మోతాదులో తినాలంటే వీటిని క‌నీసం 10 నుంచి 15 వ‌ర‌కు తినాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. ప్లాంట్ ఆధారిత ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి శ‌రీరానికి ఎంత‌గానో అవ‌స‌రం. క్యాన్స‌ర్లు, గుండె జ‌బ్బులు రావు. విట‌మిన్ ఇ ఉండ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది.

పిస్తాపప్పు
వీటిని నిత్యం 8, 9 వ‌ర‌కు తిన్నా చాలు. 10 గ్రాముల డోసుకు చేరుకోవ‌చ్చు. పిస్తా పప్పు వ‌ల్ల గుండె సమ‌స్య‌లు రావు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. పొడి చ‌ర్మం ఉన్న‌వారు తింటే వారి చ‌ర్మం మృదువుగా మారుతుంది. పీచు ఉండ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌మ‌వుతుంది. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది.

జీడిపప్పు...
జీడిప‌ప్పును రోజుకు 6,7 తిన్నా 10 గ్రాముల మోతాదుకు సుల‌భంగా చేరుకోవ‌చ్చు. దీని వ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. కంటి స‌మ‌స్య‌లు రావు. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఫైన్ నట్స్...
వీటిని నిత్యం 12 నుంచి 14 తింటే దాంతో 10 గ్రాముల కోటా పూర్త‌వుతుంది. పైన్ న‌ట్స్ వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది. గుండె సంబంధ స‌మస్యలు రావు. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌తలు త‌గ్గిపోతాయి. య‌వ్వ‌నంగా కనిపిస్తారు. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.

loader