తూర్పు గోదావరి  జిల్లా అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలైన బాలమునికుమారి ఆత్మాహత్యకు పాల్పడ్డారు.బాల కుమారి ముమ్మడివరం నగర పంచాయతీ 13వ వార్డు వైసిపి కౌన్సిలర్. అమలాపురం పార్లమెంటరీపార్టీ మహిళా అధ్యక్షురాలు. తన నియమాకం మీద విమర్శలు రావడంతో మనస్థాపం చెందిన మునికుమారి ఆదివారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఈ వార్త జిల్లాలో  సంచలనం సృష్టించింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవికి ఆమె ఇటీవలే నియమితులయ్యారు. అయితే దీనిని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.  బాలమునికుమారికి ఇంత పెద్ద పదవి లభించడంపై కొమానపల్లి వైసీపీ నాయకుడు కాశి రామకృష్ణ వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన వ్యతిరేకతను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

 

 

ఇదే ఆమె మనస్థాపానికి కారణమని , ఈ ఆవేదన తోనే   బాలమునికుమారి ముమ్మిడివరంలోని తన పుట్టింట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఇక్కడ ప్రజలు అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్యా యత్నం చేయడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.   ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు  ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.  బాలమునికుమారి ఆత్మహత్యా నేపథ్యంలో జిల్లా పార్టీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నది.   పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం  చేసేందుకు చర్యలు తీసుకోవాలని  వైసీపీకి చెందిన రాష్ట్ర నాయకులు సూచించారని తెలిసింది.