మెగాస్టార్ సినిమాకు సెలవు ప్రకటించిన దుబాయి కంపెనీ

తెలుగు రాష్ట్రాలలోనే కాదు... విదేశాల్లోనూ మెగా ఫీవర్ పట్టుకుంది... 10 ఏళ్ల తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అవడంతో చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్‌ 150 ని రిలీజ్ రోజునే చూసేందుకు అభిమానులు ఉత్సాహపడుతున్నారు.

మన దగ్గరే కాదు బాసు ఫివర్ దుబాయికి కూడా పాకింది.

దుబాయిలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ చిరంజీవి చిత్రం రిలీజ్ అవుతున్న సందర్భంగా జనవరి 11వ తేదీన తమ కంపెనీలోని ఉద్యోగలందరికీ సెలవును ప్రకటించింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం కబాలికి కూడా విదేశాలలో కొన్ని కంపెనీలు ఇలాగే సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.