తప్పతాగిన భర్తని ఈ భార్య ఏంచేసిందో తెలుసా..?(వీడియో)

First Published 9, Feb 2018, 2:39 PM IST
Drunk husband falls out of speeding car driver wife doesnt even notice it
Highlights
  • తాగి  కారులో నుంచి పడిపోయిన భర్త
  • పట్టించుకోకుండా వెళ్లిపోయిన భార్య

భర్త మద్యం సేవించడం దాదాపు ఏ భార్యకి ఇష్టం ఉండదు. చాలా మంది భార్యభర్తలకు ఈ విషయంలో తరచూ గొడవలు జరుగతూ ఉంటాయి అనడంలో ఎలాంటి ఆశ్యర్యం లేదు. ఇక ఈ వీడియో విషయానికి వస్తే.. ఇద్దరు భార్య భర్తలు.. డిన్నర్ కోసం బయటకు వెళ్లారు. డిన్నర్ తో పాటు భర్త మద్యం సేవించాడు. అనంతరం భార్యభర్తలు ఇద్దరూ.. కారులో ఇంటికి బయలుదేరారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం కదా.. అందుకే కారు భార్య డ్రైవ్ చేసింది.

 

అయితే.. పీకలదాకా తాగి ఉన్న భర్త ప్రయాణిస్తున్న కారులో  నుంచి ఒక్కసారిగా.. డోర్ ఓపెన్ అయ్యి పడిపోయాడు.  మద్యం మత్తులో కారులో నుంచి పడినా.. కనీసం లేవలేదు ఆ వ్యక్తి. విచిత్రం ఏమిటంటే.. భర్త కారులో నుంచి పడిపోయినా.. ఆ భార్య గమనించలేదు. కారు ఆపకుండా అలానే వెళ్లిపోయింది. భర్త తాగడం ఇష్టం లేక.. ఆమె అలా పట్టించుకోకుండా పోయిందేమో అనే సందేహం కలుగుతోంది.  ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. మీరు కూడా వీడియో ఓ లుక్కేయండి.

 

 

 

 

loader