అమరావతి రాజధాని నిర్మాణానికి భూముల అందించి ‘త్యాగం’ చేసిన రైతులను  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కు పంపించారు. సింగపూర్ లో రోడ్లెలా ఉన్నాయి, ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారు, అక్క డ పరిపాలన ఎలా ఉంది, వ్యాాపారం, వాణిజ్యం , వ్యవసాయం ఎలా ఉన్నాయనే దాని ఈ రైతులకు అవగాహన కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను విడతల వారీగా సింగపూర్ పంపియ్యాలని నిర్ణయించారు. ఆయన స్వయంగా వీడ్కోలు చెప్పారు (ఫోటో).

 మొదటి బృందం సింగపూర్ వెళ్లింది. తాము త్యాగం చేసిన భూములో రేపు ఎలాంటి మహానగరం రాబోతున్నదో రైతులకు ఒక అవగాహన కల్పించేందుకు, తమ త్యాగం వృధాకాదని చెప్పేందుకు ముఖ్యమంత్రి చాలా సార్లు చెప్పారు. అయితే, ఇలా లక్షలు ఖర్చు పెట్టి సింగపూర్ కు తీసుకెళ్లిన వారు రైతులు కాదని, వారంతా టిడిపి నాయకులని, వారంతా బోగస్ రైతులని అయితే, రైతులుగా చూపించి, అసలు రైతులను వదిలేశారని విమర్శలొస్తున్నాయి. సింగపూర్ కు తీసుకువెళ్లేందుకు 123 మంది ‘రైతు’లను ఎంపిక చేశారు. ఇందులో మొదటివిడతగా 34 మంది పంపారు., వారిలో  కొంతమంది హోదా ఏమిటో బయటకు వచ్చింది. వారి వివరాలివి:

బెల్లంకొండ నరసింహారావు (తాడికొండ మార్కెట్‌ యార్డు చైర్మన్, టీడీపీ నేత)
- దామినేని శ్రీనివాసరావు (తుళ్లూరు జన్మభూమి కమిటీ అధ్యక్షుడు)
- పువ్వాడ గణేష్‌బాబు (రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, తుళ్లూరు టీడీపీ నేత)
- ఆకుల ఉమామహేశ్వరరావు (ఎర్రబాలెం టీడీపీ నాయకుడు)
- ఆకుల జయసత్య (టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు, మంగళగిరి మండలం)
- ఇడుపలపాటి సీతారామయ్య (వెలగపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు)
- కారుమంచి శివప్రసాద్‌ (వెలగపూడి టీడీపీ నాయకుడు)
- జొన్నలగడ్డ శివశంకర ప్రసాద్‌ (ఎత్తిపోతల పథకం మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు)
- కట్టా వినయ్‌కుమార్‌ (ఉద్దండ్రాయునిపాలెం టీడీపీ నాయకుడు)
- ఆలూరి తారక బ్రహ్మం (మందడం టీడీపీ యూత్‌ నాయకుడు)
- దామినేని శ్రీనివాసరావు (జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీడీపీ నేత)
- పాలకాయల అర్జునరావు (ఐనవోలు గ్రామ టీడీపీ అధ్యక్షుడు)
- తరిగొప్పుల సాంబశివరావు (శాకమూరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు)
- జొన్నలగడ్డ వినయ్‌చౌదరి (రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, అనంతవరం గ్రామ టీడీపీ కార్యదర్శి)

తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెబుతుందో చూడాలని వైసిసి నేత , ఎమ్మెల్యే విశ్వేశ్వ రెడ్డి అన్నారు. ఇలా ప్రజల డబ్బును టిడిపి నేతల విహార యాత్రకు ఖర్చు చేయడం దుర్మార్గమని, దీని మీద తాము ఆందోళన చేస్తామని కూడా ఆయన ఏషియానెట్ కు చెప్పారు.